BigTV English

IND vs IRE Tour Schedule : ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా సిద్ధం.. షెడ్యూల్ విడుదల..

IND vs IRE Tour Schedule : ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా సిద్ధం.. షెడ్యూల్ విడుదల..
IND vs IRE Tour Schedule


IND vs IRE Tour Schedule : ప్రస్తుతం టీమిండియా ఒకటి తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలో పూర్తిగా సిరీస్‌లతో టీమిండియా షెడ్యూల్ ఫుల్ అయిపోయి ఉంది. అంతే కాకుండా అక్టోబర్, నవంబర్‌లో వరల్డ్ కప్‌ కూడా ఉంది. వీటన్నింటి మధ్యలో టీమిండియా ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌కు సిద్ధమయ్యింది. ఇండియా తమతో మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ఆడనుందని ఐర్లాండ్ ప్రకటిస్తూ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

తాజాగా జూన్ 27న ఐర్లాండ్‌తో ఇండియా ఆడనున్న సిరీస్ గురించి షెడ్యూల్ ఫైనల్ అయ్యింది. జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌లు మలాహిడేలోనే ఏర్పాటు చేసింది ఐర్లాండ్. 2022లో ఐర్లాండ్‌కు, ఇండియాకు మధ్య జరిగిన సిరీస్‌ను క్రికెట్ లవర్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని వారు ఆశిస్తున్నారు. ఆగస్ట్ 18 నుండి 23 వరకు మూడు టీ20 సిరీస్‌ల ఏర్పాటుకు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. జులై నుండి ఆగస్ట్ వరకు టీమిండియా వెస్టిండీస్ టూర్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే ఐర్లాండ్ టూర్ ప్రారంభం కానుంది.


‘12 నెలల్లోనే ఇండియన్ మెన్‌ను రెండోసారి ఐర్లాండ్‌కు స్వాగతించడం సంతోషంగా ఉంది’ అంటూ ఐర్లాండ్ క్రికెట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారెన్ డ్యూట్రామ్ తెలిపారు. 2022 జరిగిన రెండు మ్యాచ్‌లు పూర్తిగా సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఇప్పుడు మూడు మ్యాచ్‌లు కావడంతో ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇండియా టీమ్ షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అని బీసీసీఐకు కృతజ్ఞత తెలిపారు.
ఐర్లాండ్ వెర్సస్ ఇండియా టీ20 సిరీస్ షెడ్యూల్
18 ఆగస్ట్ : మొదటి టీ20 మ్యాచ్
20 ఆగస్ట్ : రెండో టీ20 మ్యాచ్
23 ఆగస్ట్ : మూడో టీ20 మ్యాచ్

Related News

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Big Stories

×