Nidhhi Agerwal : సవ్యసాచి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఇంటర్ ఇచ్చింది నిధి అగర్వాల్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. అలానే అక్కినేని అఖిల్ హీరోగా చేసిన మజ్ను సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అక్కడితో నిధికి కూడా మంచి పేరు లభించింది.
ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోస్తో నిధి అగర్వాల్ సినిమా చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలు నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలానే ప్రభాస్ రాజసాబ్ సినిమాలో కూడా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
పవన్ కళ్యాణ్ కు ఎలివేషన్
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది నిధి. రీసెంట్ గా ఒక ఫుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు. సింపుల్ గా ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటూ చెప్పింది. ఈ మాట మామూలుగా చెప్పిన కూడా ఇది ఒక భారీ ఎలివేషన్ల ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎడిటింగ్ చేసుకుంటూ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. గతంలో కూడా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ ప్రపంచానికి ఒక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటూ చెప్పకు వచ్చారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు వెళ్లడం వలన అది కొంతమేరకు దెబ్బతింది అనేది వాస్తవం.
ప్రభాస్ ఫుడ్ గురించి
మరోవైపు రాజా సాబ్ సినిమాలో కూడా నిధి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజా సాబ్ సినిమా సెట్ లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అంటూ నిధి అగర్వాల్ తెలిపింది. వాస్తవానికి ఆ సెట్లో ఎక్కువగా ఫుడ్ గురించి మాట్లాడుకుంటారట. అంతేకాకుండా ప్రతి ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ప్రతి ఐటెం లో కూడా ఎక్స్ట్రా లేయర్ టెస్ట్ ఉంటుంది అంటూ నిధి అగర్వాల్ తెలిపింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ మాత్రమే కాకుండా గతంలో కూడా చాలామంది ప్రభాస్ ఆతిథ్యం గురించి చెప్పిన వాళ్లే. ప్రభాస్ అనగానే ప్రతి సెలబ్రిటీ తాను వాళ్లకు పెట్టె ఫుడ్ గురించి చెబుతూ వస్తారు.
Also Read: HariHara VeeraMallu : మళ్లీ రిస్క్ చేస్తున్న హరిహర వీరమల్లు నిర్మాత, తేడా వస్తే ఇక అంతే