
Rashid Khan :నేపాల్ యంగ్ లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఖాతాలో ఉండేది. ఇప్పుడు సందీప్ లమిచానే ఖాతాలోకి వచ్చి చేరింది.
రషీద్ ఖాన్ 44 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. 2018లో రషీద్ ఈ ఫీట్ సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డు రషీద్ పేరు మీదే ఉంది. కాని, 22 ఏళ్ల నేపాలీ లెగ్ స్పిన్నర్.. కేవలం 42 మ్యాచుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. మొత్తానికి రషీద్ ఖాన్ పేరు మీద ఉన్న ఐదేళ్ల రికార్డును ఈ నేపాలీ బద్దలు కొట్టాడు. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ లో ఒమన్ జట్టుపై సందీప్ ఈ ఘనత సాధించాడు.
కేవలం రషీద్ ఖాన్ రికార్డు బ్రేక్ చేయడమే కాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసి దిగ్గజాలను దాటేశాడు సందీస్. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్కార్ట్ వంద వికెట్లు తీయడానికి 52 మ్యాచులు ఆడాడు. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ 53 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ పేసర్ షేన్‌బాండ్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 54 మ్యాచుల్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరారు.
సందీప్ లమిచానే ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2018 నుంచి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. కాని, ఆడింది మాత్రం 9 మ్యాచులే. 2018లో ఆరు వికెట్లు, 2019లో 13 వికెట్లు పడగొట్టాడు. 2020లో ఆడే అవకాశం రాలేదు. అప్పటి నుంచి సందీప్ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు.