BigTV English

Ravi Shastri on Virat Kohli’s: విరాట్ కొంచెం టైమ్ తీసుకుని ఆడు: రవిశాస్త్రి

Ravi Shastri on Virat Kohli’s: విరాట్ కొంచెం టైమ్ తీసుకుని ఆడు: రవిశాస్త్రి
Advertisement

Ravi Shastri Gives Golden Advice For Virat Kohli Ahead ind vs sa WC 2024 Final Match:  టీ 20 ప్రపంచకప్ లో ఫైనల్ వరకు టీమ్ ఇండియా దూసుకొచ్చింది. అయితే ఇన్ని మ్యాచ్ ల్లో కూడా ఇద్దరు సీనియర్ ప్లేయర్లు తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. వారెవరో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఒకరు విరాట్ కొహ్లీ, మరొకరు రవీంద్ర జడేజా.. నిష్టూరమైనా ఇద్దరూ కూడా జట్టుకి భారంగానే మారారు. అయితే వీరు ఆడకపోయినా, 9మందితో రోహిత్ శర్మ జట్టుని నడిపిస్తున్న తీరు అద్భుతమని అంటున్నారు. ఈనేపథ్యంలో ఈ ఇద్దరి ఆటగాళ్ల గురించి సీనియర్లు ఏమంటున్నారో చూద్దాం.


విరాట్ కాస్త సమయం తీసుకుని ఆడు: రవిశాస్త్రి

టీమ్ ఇండియాకి కొహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు రవిశాస్త్రి కోచ్ గా ఉండేవాడు. వీరిద్దరి మధ్యా బ్రహ్మాండమైన అండర్ స్టాండింగ్ ఉండేది. గెలుపోటములపై ఇద్దరూ సమానంగా బాధ్యతలు తీసుకునేవారు. అంతేకాదు కొహ్లీ ఆటని అతి దగ్గరగా చూసిన కోచ్ గా అతనికి మంచి పేరుంది. అలాగే వీరిద్దరిది గురుశిష్యుల బంధ అని కూడా అంటారు. అలాంటి గురువు తొలిసారి స్పందించాడు. ప్రియ శిష్యుడు విరాట్ కి విలువైన సూచనలు చేశాడు.


ఓపెనర్ గా రావడం, వెంటనే ఎటాకింగ్ మోడ్ లోకి వెళ్లడం వల్ల రాంగ్ షాట్స్ పడుతున్నాయి. పవర్ ప్లే కారణంగా కొహ్లీ ఆట లయ తప్పుతోందని అన్నాడు. అందుకే రోహిత్ స్కోరు చూస్తాడు. నువ్వు మాత్రం రెండు, మూడు ఓవర్లు క్రీజులో వెయిట్ చేసి, అప్పుడు మొదలు పెట్టమని అన్నాడు. అలా సెట్ అయితే, కొహ్లీని ఆపడం ఎవరితరం కాదని అన్నాడు. లేదంటే ఫస్ట్ డౌన్ వెళ్లు. అప్పుడు పేసర్ల స్పెల్ తగ్గుతుంది కాబట్టి, మీడియం పేస్ తో ఎలా ఆడినా ఇబ్బంది ఉండదని తెలిపాడు. గత దశాబ్దానికి పైగా విరాట్ ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేదేం లేదని అన్నాడు. అలాంటి భారీ ఇన్నింగ్స్ మళ్లీ ఆడితే, అంతా అదే సెట్ అవుతుందని అన్నాడు.

Also Read: ఫైనల్ మ్యాచ్ కి వరుణుడి ఆటంకం?

రవీంద్ర జడేజా ఉండాల్సిందే: గవాస్కర్

టీమ్ ఇండియాలో రవీంద్ర జడేజా ఉండాల్సిందేనని సీనియర్ లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అతన్ని తీయడానికి వీల్లేదని అన్నాడు. మ్యాచ్ లో కనీసం 20-30 పరుగులు ఆపుతాడని తెలిపాడు. అవి చాలా విలువైనవని అన్నాడు. అంతేకాదు మెరుపు క్యాచ్ లు అందుకుంటాడని తెలిపాడు. ఇక బౌలింగు, బ్యాటింగులో రాణిస్తే అది బోనస్ అవుతుందని అన్నాడు. అందుకే జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నించలేం, తక్కువ చేసి చూడలేమని అన్నాడు. విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ రావాలని అందరూ ఆశిస్తున్నారు. కానీ జడేజా నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు.

Related News

IND VS AUS : రేప‌టి నుంచి ఆసీస్‌, టీమిండియా వ‌న్డే సిరీస్‌.. ఎర్లీ మార్నింగే మ్యాచ్‌లు..ఉచితంగా ఎలా చూడాలి

Afg vs Pak: ముగ్గురు క్రికెట‌ర్లు మృతి…పాకిస్థాన్ సిరీస్ ర‌ద్దు చేసుకున్న అప్ఘ‌నిస్తాన్‌

RCB Sale: బ‌ల‌వంతంగా RCBని అమ్మేయాలని ప్రయత్నాలు..రంగంలోకి అదానీ?

Afghanistan Cricketers: అర్థ‌రాత్రి దొంగ‌దెబ్బ‌…పాకిస్తాన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ ముగ్గురు క్రికెటర్లు మృతి

MLA Rivaba Jadeja: జడేజా సతీమణికి మంత్రి పదవి

Vikas Kohli: ఇంట్లో ఆస్తుల పంచాయితీ..కోహ్లీ సోద‌రుడు వివాద‌స్ప‌ద పోస్ట్‌

AUSW Vs BANW: బంగ్లా ఓట‌మి, టీమిండియాకు బిగ్ రిలీఫ్‌.. సెమీస్ కు దూసుకెళ్లిన ఆసీస్‌

Afg vs Ban: కొంప‌ముంచిన ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లా ప్లేయర్ల వాహనాలపై ఫ్యాన్స్ దాడి…!

Big Stories

×