E-Paper
Advertisement

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?

నాలుగో పెళ్లికి షోయ‌బ్ మాలిక్ ఏర్పాట్లు.. తాట తీస్తాన‌ని మూడో భార్య‌ వార్నింగ్?
Advertisement

Sana Javed About Shoaib Malik fourth Marriage:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ త్వరలో నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్.. తన మూడో భార్య సనా జావేద్ కు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో స్వయంగా షోయబ్ మాలిక్ మూడవ భార్య ప్రముఖ నటి సనా జావేద్ స్పందించింది. తన భర్త నాలుగో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోందని.. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆమె ఖండించింది. ఒకవేళ తనకు అన్యాయం జరిగితే సానియా మీర్జా తరహాలో ఊరుకునేది లేదని స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అందరిలాంటి ఆడదాన్ని తాను కాదని… న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తిని అంటూ సనా జావేద్ స్పష్టం చేసింది.

షోయ‌బ్ మాలిక్ ను రోడ్డుకు ఈడ్చుతా – సనా జావేద్

షోయబ్ మాలిక్ త్వరలో నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్టు చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతని మూడవ భార్య సనా జావేద్ కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎవరు నమ్మకూడదని కోరింది. తనకు మూడు ముళ్ళు వేసేటప్పుడు.. చివరి వరకు తనతోనే ఉంటానని అల్లా సాక్షిగా ప్రమాణం చేశాడని గుర్తు చేసింది. మాలిక్ తనను మోసం చేస్తాడని అనుకోవడం లేదు… చివరి దాకా తనతో ప్రయాణిస్తాడని అనుకుంటున్నారని తెలిపింది. కానీ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయింది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

నిజంగానే సోయబ్ మాలిక్ తనకు అన్యాయం చేస్తే రోడ్డుకు ఈడ్చుతానని హెచ్చరించింది. దీంతో సనా జావేద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ప్రముఖ నటి వనీజా సత్తార్ మరో భామ లైబా ఖాన్ తో షోయ‌బ్ మాలిక్ నాలుగో పెళ్లి జరగనుందని 2026 జనవరి నుంచే ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటికీ ఈ ప్రచారం సాగుతూనే ఉంది. సనా జావేద్ తో తన ప్రయాణం కొనసాగించలేనని.. నాలుగో పెళ్లికి సిద్ధంగా ఉన్నానని షోయబ్ మాలిక్ కామెంట్ చేసినట్టు కూడా ప్రచారం చేస్తున్నారు.

మూడు పెళ్లిళ్లు చేసుకున్న షోయబ్ మాలిక్

Advertisement

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 2002లో ఆయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2010లో విడాకులు ఇచ్చి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ, 2023లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 2024లో నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు మాలిక్.

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Related News

ఆకాశ్ దీప్‌కు గాయం, మ‌ధ్య‌లోనే ప్రసిద్ ఎంట్రీ.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏంటి?

భారత దేశం చాలా గొప్పది.. పాక్ ప్లేయర్లకు అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్.. వాడు ఈకతో సమానమంటూ!

రోహిత్ శర్మకు పగ్గాలు… అంబానీపై అలిగిన బుమ్రా.. అందుకే వైస్ కెప్టెన్సీ వద్దని ‘ఛీ’ కొట్టాడా?

పాక్ ఫైన‌ల్ చేరినా కిక్ లేదు.. భార‌త్ ఉంటేనే అస‌లైన మ‌జా

ఒకే ఇన్నింగ్స్ లో 6 క్యాచ్ లు వ‌దిలేస్తారా? ఈ చెత్త ఫీల్డింగ్ తో WTC గెల‌వ‌లేము

నెట్ బౌల‌ర్ గా కూడా హ‌ర్షిత్ రాణా ప‌నికిరాడు..అలాంటిది మూడు ఫార్మాట్లు ఆడిస్తున్నారు

Big Stories

Advertisement
×