Ravichandran Ashwin: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ {Ravichandran Ashwin} తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మూడవ టెస్ట్ ముగిసిన వెంటనే అశ్విన్ తన రిటైర్మెంట్ ని ప్రకటించి.. ఆ వెంటనే బ్రెస్బెన్ నుంచి బయలుదేరి గురువారం తన స్వస్థలం చెన్నైకి చేరుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికి ఇంటికి చేరుకున్న అశ్విన్ కి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
Also Read: Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్ రూం నుంచి బయటకు పంపలేదు !
అశ్విన్ రిటైర్మెంట్ అతడి కుటుంబ సభ్యులను కూడా భావోద్వేగానికి గురిచేసింది. అయితే అశ్విన్ {Ravichandran Ashwin} రిటైర్మెంట్ ప్రకటన పట్ల ఆయన తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎదురైన అవమానాలు భరించలేకే తన కుమారుడు అశ్విన్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని కీలక వ్యాఖ్యలు చేశారు రవిచంద్రన్. అశ్విన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో అతనికే తెలుసని.. కానీ ఇది మాకు ఓవైపు గౌరవకరమైన, మరొకవైపు బాధాకరమైన పరిణామం అని అన్నాడు. బహుశా అతనికి జట్టులో ఎదురైన అవమానాలే అతడి రిటైర్మెంట్ కి కారణం అయి ఉండొచ్చని.. ఇంకా ఎన్నాళ్లు భరిస్తాడని పేర్కొన్నాడు.
” అశ్విన్ 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కి గురిచేసింది. రిటైర్మెంట్ విషయాన్ని {Ravichandran Ashwin} మాకు కూడా ఆలస్యంగా తెలిపాడు. అతడి మైండ్ లో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో. ఏది ఏమైనా అతని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నా. కానీ అశ్విన్ ఇంకొంతకాలం ఆడాల్సింది” అని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. దీంతో అశ్విన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ తన తండ్రి చేసిన ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించారు. అంతేకాదు తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
Also Read: Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్ కూడా సిక్సు కొట్టలేదు ?
“మా నాన్నకు మీడియాతో ఎలా మాట్లాడాలన్నది శిక్షణ లేదు. నాన్న.. ఏంటిది? ఇలా డాడ్ స్టేట్మెంట్ ట్రెండ్ ను నువ్వు కూడా అనుసరిస్తావని నేను అస్సలు ఊహించలేదు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఆయనని క్షమించి ఒంటరిగా వదిలేయండి. ఇబ్బంది పెట్టకండి” అని అశ్విన్ {Ravichandran Ashwin} ట్వీట్ చేశాడు. ఇక తన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు చేసి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అశ్విన్.. అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ చర్చలకే దారితీస్తుంది. కానీ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఖచ్చితమైన కారణమేమిటో అశ్విన్ కూడా ఇప్పటికీ వెల్లడించలేదు.
My dad isn’t media trained, dey father enna da ithelaam 😂😂.
I never thought you would follow this rich tradition of “dad statements” .🤣
Request you all to forgive him and leave him alone 🙏 https://t.co/Y1GFEwJsVc
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 19, 2024