BigTV English

Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్‌ రూం నుంచి బయటకు పంపలేదు !

Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్‌ రూం నుంచి బయటకు పంపలేదు !

Imam Ul Haq: 2023 వరల్డ్ కప్ ( world cup 2023) కోసం ఇండియాలో పర్యటించినప్పుడు తమకు నరకం కనిపించిందని… పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హాక్ ( Imam Ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా… ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. విషం కక్కాడు ఈ పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హాక్ ( Imam Ul Haq ) . వరల్డ్ కప్ కోసం వెళ్ళినప్పుడు… హోటల్ నుంచి బయటకు కూడా మమ్మల్ని వెళ్లనివ్వలేదని… ఆగ్రహించాడు ఇమామ్ ఉల్ హాక్ ( Imam Ul Haq ).


టీమిండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan ) మధ్య ప్రస్తుతం చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( ICC Champions Trophy 2025) సంబంధించిన పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ దేశంలోనే ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్లో చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) జరిగితే… మేము వెళ్ళేది లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహించాలని…. ముందు నుంచి భారత్ డిమాండ్ చేస్తోంది.

Also Read: Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్‌ కూడా సిక్సు కొట్టలేదు ?


అయితే పాకిస్తాన్ మాత్రం దీనికి అసలు ఒప్పుకోవడం లేదు. ఐసీసీ రూల్స్ ప్రకారం మా దేశంలోనే జరగాలని…. ఇండియా కూడా పాకిస్తాన్ కు రావాల్సిందేనని…. పిసిబి బోర్డ్ ప్రకటించింది. మొండి పట్టు పట్టింది. అయితే హైబ్రిడ్ మోడల్ లో భాగంగా దుబాయ్ లేదా సౌదీ అరేబియా లాంటి.. ఇతర దేశాలలో టోర్నమెంట్ నిర్వహిస్తే ఖచ్చితంగా వస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఐసీసీకి తెలిపింది. అయితే దీనిపై పాకిస్తాన్ అలాగే టీమిండియాను ఒప్పించేందుకు… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నానా కష్టాలు పడింది.

 

అయితే చివరికి హైబ్రిడ్ మోడల్ కే పాకిస్తాన్ తలోగ్గినట్లు సమాచారం. దీనికి కారణం ఇండియా ఈ టోర్నమెంట్ ఆడకపోతే ఐసీసీ తో పాటు పాకిస్తాన్ కు కూడా నష్టమే. కాబట్టి టీమిండియా డిమాండ్లను కచ్చితంగా పరిష్కరించాలి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో కూడా హైబ్రిడ్ మోడల్ కు ఒప్పించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy 2025) టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని… దుబాయిలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( ICC Champions Trophy 2025) సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు విషం చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇమామ్ ఉల్ హాక్… 2023 ప్రపంచ కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో ఇండియాలోనే వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు ఇండియాకు పాకిస్తాన్ రావడం జరిగింది. అయితే ఆ సమయంలో పాకిస్తాన్ ప్లేయర్లకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు ఇమామ్. 2023 వరల్డ్ కప్ కోసం ఇండియాలో పర్యటించినప్పుడు…హోటల్‌ నుంచి కూడా మా ప్లేయర్లను బయటకు పంపలేదని తెలిపారు. ఎంత రిక్వెస్ట్‌ చేసినా బయటకు పర్మిషన్‌ ఇవ్వలేదని వివరించారు. అయితే.. సెక్యూరిటీ కారణంగా ఇండియన్‌ పోలీసులు అలా చేశారన్నారు. దాని వల్ల మాకు ఇబ్బంది అయిందన్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×