మూవీ : బచ్చల మల్లి
రిలీజ్ డేట్ : 20 డిసెంబర్ 2024
డైరెక్టర్ : సుబ్బు మంగాదేవి
నటీనటులు : అల్లరి నరేష్, అమృత అయ్యార్, రావు రామేష్, సాయి కుమార్‌తో పాటు తదితరులు
నిర్మాత : రాజేష్ దండా
నిర్మాణ సంస్థ : హాస్య మూవీస్
Bachchala Malli Movie Rating : 2/5
Bachchala Malli Movie Review and Rating : అల్లరి నరేష్ ఈ ఏడాది ‘నా సామి రంగ’ లో కీలక పాత్ర చేసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు హీరోగా హిట్టు కొట్టడానికి బచ్చల మల్లితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అతని కోరిక తీర్చేందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాము రండి..
కథ :
బచ్చల మల్లి (అల్లరి నరేష్) మహా కోపిష్టి, మూర్ఖుడు కూడా. అతని తండ్రి సత్య నారాయణ (బలగం జయరామ్) మరో కాపురం పెట్టాడు అనే ఉద్దేశంతో అతను అలా మారిపోతాడు. చదువు మానేసి, చెడు తిరుగుళ్ళు, చెడు సావాసాలతో మొరటు మనిషి అయిపోతాడు. కూలి పనికి వెళ్లడం .. జనాలని కొట్టడం, వేశ్యల వద్దకి వెళ్లి అక్కడ కూడా గొడవలు పెట్టుకోవడం వంటివి చేస్తాడు. ఇలాంటి టైమ్ లో అతని జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే మల్లిలో చలనం కలుగుతుంది. ఆమె పద్దతి చూసి ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను పొందడానికి మంచిగా మారాలని ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని సమస్యలు వచ్చి పడుతాయి? మరి ఆ సమస్యలను దాటుకుని మల్లి … కావేరి ని పొందగలిగాడా? చివరికి మల్లి జీవితం ఏ మైంది అనేది కథ.
విశ్లేషణ:
‘బచ్చల మల్లి’ కథని తన తల్లికి క్షమాపణ లేఖ అని చెప్పి దర్శకుడు సుబ్బు అందరినీ కదిలించిన సంగతి తెలిసిందే. అంతేకాదు బచ్చల మల్లి కథ మొత్తాన్ని టీజర్, ట్రైలర్ల ద్వారా అతను చేప్పేసాడు. కేవలం స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్, అతని లైఫ్ లో జరిగిన ట్రాజెడీ వంటివి ఆసక్తి కలిగించే అంశాలు అని ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లాలి. అయితే కథనంలో కూడా మనకి చాలా రిఫరెన్సులు కనిపిస్తాయి. గతంలో నాగబాబు ప్రథాన పాత్రలో వచ్చిన ‘కౌరవుడు’, ప్రభాస్ ‘యోగి’ ఆది పినిశెట్టి ‘మృగం’ ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’ వంటి సినిమాల పోలికలు కనిపిస్తాయి. దర్శకుడు సుబ్బు సోలో బ్రతుకు సో బెటర్ ను సెన్సిబుల్ గా డీల్ చేశాడు. అందులో అన్ని కరెక్ట్ గా సరిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇందులో అతను హీరో క్యారెక్టర్ పై రాసుకున్న సన్నివేశాలు, క్లైమాక్స్ తప్ప మిగిలిన భాగం అంత ఆకట్టుకోదు. కొన్ని చోట్ల సినిమా మరీ స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా టార్గెటెడ్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత రాజేష్ దండ స్క్రిప్ట్ తో మొదటి నుండీ ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నాడు. కథకి ఎంత పెట్టాలో అంత బడ్జెట్ పెట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా తక్కువ కాలేదు. సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే.. అల్లరి నరేష్ బాగా చేశాడు. ఒక రకంగా ఇది అతని కెరీర్ బెస్ట్ యుక్టింగ్ చేశాడు అని చెప్పాలి. అమృత అయ్యర్ బాగానే చేసింది కానీ ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉంది. రోహిణి మరోసారి తన నటనతో సినిమాకి ప్రాణం పోసింది. రావు రమేష్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆయన కూడా తన బెస్ట్ ఇచ్చాడు.ప్రసాద్ బెహరాకి మళ్ళీ కొంచెం నిడివి ఎక్కువ కలిగిన పాత్ర దొరికింది. అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ వంటి వాళ్లు ఉన్నంతలో బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్ :
అల్లరి నరేష్
క్లైమాక్స్
నిడివి
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
సాగదీత
మొత్తంగా బచ్చల మల్లి కోర్ పాయింట్ బాగున్నా కథనం వేగంగా లేకపోవడంతో ఒక బిలో యావరేజ్ సినిమాగా అనిపిస్తుంది.
Bachchala Malli Movie Rating : 2/5