BigTV English

Jaipur Explosion: జైపూర్ లో భారీ పేలుడు.. 40 వాహనాలు దగ్ధం.. 8 మృతి, 37 తీవ్రగాయాలు..

Jaipur Explosion: జైపూర్ లో భారీ పేలుడు.. 40 వాహనాలు దగ్ధం.. 8 మృతి, 37 తీవ్రగాయాలు..

Jaipur Explosion| రాజస్థాన్ రాష్ట్రంలో రాజధాని జైపూర్ లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఉదయం 5.30 గంటలకు రాజస్థాన్ లో అజ్మేర్ రోడ్ పెట్రోల్ పంప్ వద్ద నిలబడి ఉన్న సిఎన్‌జి గ్యాస్ ట్యాంకర్ ని వెనుక వచ్చిన పెద్ద లారీ ఢీకొట్టడంతో ఈ పేలుడు జరిగింది. అయితే ఈ పేలుడు కారణంగా సమీపంగా నిలబడి ఉన్న వాహనాలు, రోడ్డుపై ట్రక్క్ వెనకాలే నిలబడి ఉన్న వాహనాలు అన్నింటికీ నిప్పు అంటుకోవడంతో వెనుక ఉన్న వాహనాలు మిగతా వాహనాలకు ఢీ కొట్టాయి.


పేలుడు కారణంగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 40 వాహనాలు దగ్ధమయ్యాయి. వాహనదారులు 8 మంది చనిపోగా.. దాదాపు 34 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికారిక సమాచారం. గాయపడిన వారిలో చాలా మంది ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది ఘటన సమాచారం అందుకొని అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చాలా పెద్ద పేలుడు. ఈ పేలుడు ప్రభాం.. చుట్టు పక్కల 300 మీటర్ల రేడియస్ వరకు వ్యాపించింది. ఈ రేడియస్ లో ఉన్న అన్ని వాహనాలు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. చాలా వాహనాలైతే దగ్ధమయ్యాయి. వాహనాలు నడుపుతున్న చాలా మంది డ్రైవర్ల శరీరాలు అగ్నిప్రమాదం వల్ల కాలిపోయాయి. మేము సమచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాం. అగ్ని మపక సిబ్బంది భారీ జ్వాలలు ఆర్పేందుకు కృషి చేస్తోంది. పోలీసులు కూడా సహాయం చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించాం. ఈ భారీ పేలుడు కారణంగా సంభవించిన అగ్నిప్రమాదం కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే దట్టమైన పొగల రూపంలో కనిపిస్తోంది.” అని అన్నారు.


Also Read: బ్యాంకులో కన్నం.. కోట్ల విలువ చేసే డబ్బు బంగారం చోరీ.. అలారం మోగలేదు!

స్థానిక మీడియా కథనం ప్రకారం.. పేలుడు శబ్దాలు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. సిఎన్‌జి ట్యాంక్ పేలడంతో వరుసగా పేలుడుకు సంబంధించి భారీ శబ్దాలు వినిపించాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో వెల్లడైన మరో విషయమేమిటంటే.. గ్యాస్ ట్యాంకర్ ని ఢీకొట్టిన ట్రక్కులో రసాయనాలున్నాయి. ఆ కెమికల్స్ వల్లనే ఇంత భారీ పేలుడు సంభవించింది.

“కెమికల్స్ తో నిండిన ఒక ట్రక్కు.. ఒక గ్యాస్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో సంభవించిన ఈ పేలుడు కారణంగా అజ్మేర్ రోడ్డుపై ఆ ప్రాంతంలో ఉన్న ట్రక్కులకు నిప్పు అంటుకుంది. ఆ ట్రక్కుల్లోని డ్రైవర్లు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది సమర్థవంతంగా గత నాలుగు గంటల నుంచి శ్రమించి అగ్ని జ్వాలలు ఆర్పివేసింది. కాలిపోయిన 40 వాహనాల్లో మరో 2,3 వాహనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రమాదంలో కాలిపోయిన వారిని సమీపంలోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించాం.” అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

పేలుడు ఘటన గురించి తెలుసుకొని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా ఎస్ఎంఎస్ ఆస్పత్రి వచ్చారు. బాధితులను కలిసి.. చనిపోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన వారందరికీ వెంటనే చికిత్స అందించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×