E-Paper
Advertisement

Ravindra Jadeja and Kl Rahul : జడేజా-రాహుల్ గోల్డ్ మెడల్ ఎవరికి? టెన్షన్‌లో ఫీల్డింగ్ కోచ్.

Ravindra Jadeja and Kl Rahul : జడేజా-రాహుల్ గోల్డ్ మెడల్  ఎవరికి?  టెన్షన్‌లో ఫీల్డింగ్ కోచ్.
Advertisement
Ravindra Jadeja and Kl Rahul

Ravindra Jadeja and Kl Rahul : అద్భుతమైన క్యాచ్ పట్టి..స్టేడియాన్ని అల్లాడించిన రవీంద్ర జడేజా ఒకవైపు అయితే, ఒలింపిక్స్ లో అథ్లెట్ లా విల్లులా వంగి కీపర్ క్యాచ్ అందుకున్న రాహుల్ మరోవైపు నిలిచారు. కాకపోతే ఈసారి గోల్డ్ మెడల్ నాకే అంటూ జడ్డూ చేసిన సైగలకు స్టేడియం కూడా మద్దతు పలకడం విశేషం.

వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డ్ బయట కొన్ని విశేషాలు జరిగితే, గ్రౌండ్ లో అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు కనువిందు చేశాయి. ముఖ్యంగా మన ఇండియన్ ఫీల్డర్లు ఈ మధ్య కాలంలో ఇంత గొప్పగా ఫీల్డింగ్ చేయడం ఈ మ్యాచ్ లోనే కనిపించింది. అయితే ఒకట్రెండు మెరుపులు ఉంటాయి కానీ, మొత్తం జట్టు సభ్యులంతా కూడా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోకూడదనే కసితోనే ఆడినట్టుగా కనిపించింది.

Advertisement

ఈ ప్రక్రియలో ఫీల్డింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు కూడా..ముఖ్యంగా బౌండరీ లైన్ల దగ్గర మనవాళ్లు ఫోర్లు ఆపిన తీరు చాలా గొప్పగా అనిపించింది. ఒక 20 నుంచి 30 పరుగులు ఫీల్డింగ్ ద్వారా ఆపగలిగారని చెప్పాలి. ఇకపోతే ఇంత చెప్పుకున్నాక మ్యాచ్ లో రెండు అద్భుతమైన క్యాచ్ లు చెప్పకపోతే..అసంపూర్తిగా ఉంటుంది. అవి రెండూ కూడా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఇద్దరూ పట్టారు. రెంటికి రెండు కూడా మంచి క్యాచ్ లే అని చెప్పాలి.

అప్పుడు 43వ ఓవర్ నడుస్తోంది. అప్పటికి ముష్ఫికర్ రహీమ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫ్రంట్ పుట్ కి వచ్చి మరీ ఎడాపెడా కొట్టేస్తున్నాడు. ఈ టైమ్ లో బూమ్రా బౌలింగ్ కి వచ్చాడు. తను వేసిన బాల్ ని ముష్ఫికర్ ఆఫ్ సైడ్ వైపు ఆడాడు. పాయింట్ దగ్గర కాచుకుని కూర్చున్న జడేజా కళ్లు మూసి తెరిచేలోగా కుడివైపు ఒక్క డైవ్ చేశాడు. నీటిలో చేపను పట్టినట్టు ఛపక్ మని పట్టేసి..బొంగరంలా తిరుగుతూ కింద పడ్డాడు. అంతే లేచిన వెంటనే స్టేడియం అంతా హోరెత్తిపోయింది. ఈ క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. అంతేకాదు ఈసారి గోల్డ్ మెడల్ నాదే అంటూ జడ్డూ చేసిన సైగలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక్కడ చెప్పుకోతగ్గ మరో క్యాచ్ ఏమిటంటే కేఎల్ రాహుల్ పట్టింది.
మెహదీ హాసన్ మిరాజ్ శరీరాన్ని తాకేలా మహ్మద్ సిరాజ్ బంతిని సంధించాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ కీపర్ వైపు వెళ్లింది. వెంటనే రాహుల్ అలర్ట్ అయ్యాడు. ఎడమవైపునకు జెట్ స్పీడ్ తో డైవ్ చేసి క్యాచ్ పట్టీసుకున్నాడు. తను 0.78 సెకన్లలో రియాక్ట్ అయిన తీరుతో స్టేడియం హోరెత్తిపోయింది.

మొత్తానికి ఇండియా టీమ్ మాత్రం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పక్కా ప్రొఫెషనల్ గా ఆడి జయహో అనిపించారు.

Related News

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

Big Stories

Advertisement
×