RCB Captain In Tirumala: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈసారి మెరుగ్గా రాణిస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అటు పాయింట్లు పట్టికలో కూడా టాప్ 1 లో కొనసాగుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో ఈసారి అద్భుతంగా రాణిస్తోంది. అందుకే మంచి ఫలితాలను అందుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు.
also read: Memes on RCB : RCBకి ఇదేం కర్మ రా.. కప్పు రావడం లేదని..వెల్డింగ్ షాప్ లో చేసుకున్నారు
తిరుమలలో మెరిసిన బెంగుళూరు ప్లేయర్లు
ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా.. తిరుమల శ్రీవారి సన్నిధిలో మెరిశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు. ఏకంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బెంగళూరు కెప్టెన్ రజత్ తో ( Royal Challengers Bangalore captain Rajat patidar) పాటు… జితేష్ శర్మ ( Jitesh sharma) అలాగే ఉమెన్ క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ ( Shreyanka patil)కూడా తిరుమల శ్రీవారిని ( Tirumala srivaru) దర్శించుకోవడం జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో… టీటీడీ పాలక మండలి అధికారులు కూడా వారికి ఘన స్వాగతం పలికారు.
బెంగళూరు ప్లేయర్లకు ఘన స్వాగతం
తిరుమల శ్రీవారి సన్నిధికి ఎవరైనా వీఐపీ భక్తులు వస్తే కచ్చితంగా తిరుమల శ్రీవారి సన్నిధికి సంబంధించిన టిటిడి అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతారు. రాష్ట్రంతో అలాగే దేశంతో సంబంధం లేకుండా వాళ్లకు కచ్చితంగా మంచి స్వాగతం లభిస్తుంది. అయితే క్రీడాకారులు వచ్చినా కూడా వెంటనే స్పందించి వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి పాలకమండలి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ , జితేష్ శర్మ అలాగే ఉమెన్ క్రికెటర్ శ్రేయంక పాటిల్ తిరుమలకు వచ్చారు. ఈ విషయం తెలియగానే వాళ్లకు ప్రత్యేక ఆహ్వానం అందించారు టీటీడీ అధికారులు.
శాలువా కప్పి తిరుమల దేవస్థానానికి.. స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని వాళ్లకు అందించారు టిటిడి అధికారులు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు…. తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారు. ఈ సంవత్సరం ఎలాగైనా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గెలవాలని… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు తిరుమల శ్రీవారిని మొక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏడు మ్యాచ్లలో విజయం సాధించింది. మూడు మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్లు సాధించింది. ఈ ఊపు కొనసాగిస్తే ఖచ్చితంగా కప్పు కొట్టడం గ్యారంటీ అంటున్నారు.
Also Read: Shahid Afridi: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిపై దాడి… వీడియో వైరల్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, జితేష్ శర్మ, ఉమెన్ క్రికెటర్ శ్రేయాంక పాటిల్#RoyalChallengersBengaluru #RCB pic.twitter.com/bzS8t2OBvM
— BIG TV Breaking News (@bigtvtelugu) April 30, 2025