BigTV English

India vs Pakistan : సీన్‌లోకి సూపర్ ఆఫీసర్స్.. జాయింట్ కిల్లర్స్.. పవర్‌ఫుల్ కాంబినేషన్

India vs Pakistan : సీన్‌లోకి సూపర్ ఆఫీసర్స్.. జాయింట్ కిల్లర్స్.. పవర్‌ఫుల్ కాంబినేషన్

India vs Pakistan : యుద్ధం.. యుద్ధం.. యుద్ధం. భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్‌ పని పట్టాల్సిందేనని పంతం పడుతున్నారు. కనీసం సర్జికల్ స్ట్రైక్స్ అయినా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పాక్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా.. పహల్గాం ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇవ్వాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. మూడు రోజులుగా 140 కోట్ల మంది భారతీయులు ఢిల్లీ వైపే చూస్తున్నారు. కేంద్రం ఎలాంటి యాక్షన్ చేయబోతుందానని టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారు. ప్రధాని మోదీ సైతం మేటర్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వరుసగా అత్యన్నత స్థాయి సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నారు. లేటెస్ట్‌గా ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కీలక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఈ సూపర్ కేబినెట్ భేటీ జరగడం ఇది రెండోసారి. ఈ మీటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.


మాజీ రా చీఫ్‌కు కీలక బాధ్యతలు

జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్‌వ్యవస్థీకరించింది కేంద్రం. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది.ఈ బోర్డుకు చైర్మన్‌గా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్‌ జోషిని నియమించింది. పీఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్‌లు మన్మోహన్ సింగ్, రాజీవ్ రంజన్‌ వర్మ, మాజీ IFS అధికారి వెంకటేశ్ శర్మ.. బోర్డు సభ్యులుగా ఉండనున్నారు.


అలోక్ గుప్పిట్లో పాక్ గుట్టు!

RAW మాజీ చీఫ్ అలోక్ జోషి. ఈ పేరు చెబితేనే పాక్‌ ఉలిక్కిపడుతుంది. ఆయన నాయకత్వంలోనే ‘రా’ టీమ్ పాకిస్తాన్‌లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌పర్ట్ ఆయన. దాయాది దేశంలోని కీలక స్థావరాలు, టాప్ అధికారులు, ఆ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారమంతా అలోక్ జోషికి ఫింగర్ టిప్స్‌లో ఉంటుందని అంటారు.

గేమ్ ఛేంజర్‌గా అలోక్ జోషి

1976 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అలోక్ జోషి. 2005లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2010లో RAW కు స్పెషల్ సెక్రటరీగా.. ఆ తర్వాత రా చీఫ్‌గా చేశారు. అలాంటి సూపర్ కాప్‌ను.. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బోర్డుకు ఛైర్మన్‌గా ఎంపిక చేసి గేమ్ ఛేంజర్‌గా ముందుంచారు ప్రధాని మోదీ.

అజిత్ దోవల్ ఇన్ యాక్షన్

మరోవైపు, ఓటమి ఎరుగని ధీరుడు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ సూత్రధారి దోవలే. 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాక్‌ చేతికి చిక్కిన ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను సురక్షితంగా విడిపించిన వ్యూహకర్త ఆయనే. 1999 ఎయిర్ ఇండియా విమానం హైజాకింగ్‌లో ఉగ్రవాదులతో చర్చలు జరిపింది అజితే. 1988 అమృత్‌సర్ గోల్గెన్ టెంపుల్‌లో నక్కిన.. సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు.. ఇండియన్ ఆర్మీ చేపట్టిన బ్లాక్ థండర్ ఆపరేషన్‌లో కీ రోల్ ప్లే చేశారు. అలా దోవల్ హిస్టరీ బుక్‌లో అనేక సాహసాలు, అంతకుమించి సంచలనాలు.

Also Read : అజిత్ దోవల్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. కంప్లీట్ డీటైల్స్

అజిత్, అలోక్.. పవర్‌ఫుల్ కాంబినేషన్

పహల్గాం టెర్రర్ అటాక్స్ తర్వాత.. ఇప్పుడు అజిత్ దోవల్, అలోక్ జోషిలు కలిసి పని చేసే అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. వాళ్లిద్దరి కాంబినేషన్లో.. పాకిస్తాన్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా రివేంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా పీవోకేపై అటాక్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన పాక్.. ఉగ్రవాద స్థావరాలను పీవోకే నుంచి తరలిస్తోంది. సరిహద్దుల్లో రాడార్లను మోహరించింది. ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో భారత్ తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు ప్లాన్ చేస్తోందంటూ.. ఆ మేరకు కచ్చితమైన నిఘా సమాచారం తమకు ఉందంటూ కీలక కామెంట్స్ చేశారు పాక్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×