తొలి మ్యాచ్ లో ఆర్సిబి విక్టరీ:
RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ని గ్రాండ్ విక్టరీతో శుభారంభం చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి}. ఈ 18వ సీజన్ తొలి మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కేకేఆర్ – ఆర్సిబి మధ్య తొలి మ్యాచ్ జరగగా.. ఆర్సిబి జట్టు 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సిబి జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కలకత్తా 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహనే {56} హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 44 పరుగులు, రఘువన్షీ 30 పరుగులు అందించారు. దీంతో కేకేఆర్ 174 పరుగులు చేసింది. ఇక ఆర్సిబి బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్ వుడ్ 2, యష్ దయాల్, రసిక్ సలాం, సుయాష్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ, ఫీల్ సాల్ట్ ల ఓపెనింగ్ జోడి గొప్ప ఆరంభాన్ని అందించింది.
తొలి వికెట్ కి వీరిద్దరూ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారింది. సాల్ట్ 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ చేరగా.. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు. దీంతో కేకేఆర్ పై 175 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం ద్వారా ఆర్సిబి జట్టు ఈ సీజన్ ని అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందని అంటున్నారు అభిమానులు.
ఇక వరుస ఓటములేనా..?:
ఇప్పటివరకు 17 ఐపీఎల్ సీజన్లలో ఆర్సిబి జట్టు ఆరుసార్లు సీజన్ లోని తొలి మ్యాచ్ లో ఇతర జట్లతో పోటీ పడింది. ఇందులో ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2018 లో కలకత్తా తో తలపడింది ఆర్సిబి. ఈ మ్యాచ్ లో ఆర్సిబి పై కలకత్తా గెలుపొందింది. ఆ తర్వాత 2017 లో హైదరాబాద్ తో తలపడింది ఆర్సిబి. ఈ మ్యాచ్ లో ఆర్సిబి పై హైదరాబాద్ జట్టు గెలుపొందింది.
2019లో చెన్నైతో, 2021 లో ముంబైతో, 2024 లో చెన్నైతో.. ఇలా ఆరుసార్లు ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్లో {opening match} ఈ జట్లతో పోటీపడి ఓటమిని చవిచూసింది. ఇప్పుడు 25 లో కలకత్తా తో పోటీపడి తొలి మ్యాచ్ లో గెలుపొందింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో గెలిస్తే.. ఇక మిగతా మ్యాచ్లలో వరుసగా ఓడిపోతుందని అంటున్నారు నెటిజెన్లు. కానీ ఆర్సిబి అభిమానులు మాత్రం ఈ ఫార్ములా నమ్మొద్దని.. ఈసారి ఆర్సిబి వరుస విజయాలతో కప్ ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.