Ban For RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. మొట్టమొదటిసారిగా ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధించేందుకు… భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు సిద్ధమవుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు 11 మంది మరణించిన నేపథ్యంలో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘోర ప్రమాదం జరిగినప్పుడు స్పందించకపోతే.. తమపై చెడ్డ పేరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని.. బీసీసీఐ పెద్దలు ఆలోచన చేస్తున్నారట.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
బెంగళూరు పై రెండేళ్ల బ్యాన్ ?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో 11 మంది బెంగళూరు అభిమానులు మరణించారు. మరో 33 మంది ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పదిమందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అందులో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలోనే రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై బ్యాన్ విధించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కొంతమంది ఏడాది పాటు బెంగళూరుపై బ్యాన్ విధిస్తే బాగుంటుందని.. సూచనలు చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ మేరకు మరో నాలుగు రోజుల్లోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై బ్యాన్ విధించేలా… చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. కచ్చితంగా బ్యాన్ లేదా.. మరో నిర్ణయం అయినా తీసుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తొక్కిసలాట ఘటన… హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో అంతర్జాతీయంగా.. దోషిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తొక్కిసలాటలో 11 మంది మృతి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ఛాంపియన్ అయిన తర్వాత బెంగళూరు అభిమానుల కోసం పరేడ్ నిర్వహించారు. మొన్న బుధవారం రోజున చిన్న స్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 30000 కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియం దగ్గరికి 3 లక్షల మంది వచ్చారు. దీంతో పరిస్థితి… పూర్తిగా అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు మృతి చెందారు. మరో 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. మృతి చెందిన కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించింది.
🚨ONE YEAR BAN FOR RCB 🚨
"RCB may face a ban from IPL 2026 if found responsible for safety lapses in the Bengaluru stampede. Authorities are investigating the incident seriously".
~ What's your take on this 🤔 pic.twitter.com/dJskCNFuaZ
— Richard Kettleborough (@RichKettle07) June 9, 2025