BigTV English

RCB : ఆర్సీబీకి ఆ ముగ్గురే ఆధారం… 5 సీజన్ల నుంచి ఇదే తంతు

RCB : ఆర్సీబీకి ఆ ముగ్గురే ఆధారం… 5 సీజన్ల నుంచి ఇదే తంతు

RCB : ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచులలో 4 మ్యాచులు గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆటగాళ్లను చూస్తే… ఏ జట్టు అయినా బెంగళూరును ఓడిస్తుందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. వరల్డ్ ఫేమస్ ఆటగాళ్లు, ఎక్కువ మంది అభిమానులు ఉన్న బ్యాట్స్ మెన్ ఉన్నది బెంగళూరు జట్టులోనే. కాని, ముగ్గురు తప్ప మిగతా ఆటగాళ్లెవరు పెద్దగా రాణించడం లేదు. ముఖ్యంగా బెంగళూరు జట్టు మిడిల్ ఆర్డర్ అట్టర్లీ ఫెయిల్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సపోర్ట్ ఉండి ఉంటే… బెంగళూరు స్టోరీ మరోలా ఉండేది.


గత ఐదు సీజన్లను పరిశీలిస్తే.. బెంగళూరు జట్టు మొత్తం ఆధారపడుతున్నది ముగ్గురు ఆటగాళ్లపైనే. ఈ సీజన్‌‌లో విరాట్ కొహ్లీ, డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టుకు ఆధారం. ఇలా ఐదేళ్ల నుంచి ప్రతీ సీజన్‌లో ముగ్గురు ఆటగాళ్లే బెంగళూరును గట్టెక్కిస్తున్నారు. ఏదైనా గేమ్‌లో ఆ ముగ్గురూ ఫెయిల్ అయితే ఇక అంతే సంగతులు. మిడిల్ ఆర్డర్‌లో ఉన్న మహిపాల్, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేశ్ కార్తీక్… వీళ్లెవరూ పెద్దగా మెరుపులు మెరిపించింది లేనే లేదు.

1.2015లో
ఈ సీజన్‌లో ముగ్గురు ప్లేయర్లనే నమ్ముకుంది ఆర్సీబీ. విరాట్ కొహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్. ఈ ముగ్గురి వల్లే ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది బెంగళూరు. కాని, మిడిల్ ఆర్డర్‌లో ఉన్న మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, దినేశ్ కార్తీక్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో… రెండో క్వాలిఫయర్లోనే ఓడిపోయింది.


2. 2018లో
ఈ సీజన్లోనూ ముగ్గురిపైనే ఆధారపడాల్సి వచ్చింది. విరాట్ కొహ్లీ, డివిలియర్స్, డికాక్. జట్టును గట్టెక్కించడానికి ఈ ముగ్గురు ఎంత ప్రెషర్ తీసుకున్నారో ఆ సీజన్‌లో. పైగా జట్టులో మెక్‌కలమ్, మోయిన్ అలీ, కోరే అండర్సన్ వంటి స్టార్లు ఉన్నా.. ఆ సీజన్లో ఫెయిల్ అయ్యారు. ఫలితంగా ప్లే ఆఫ్స్‌కు కూడా క్వాలిఫై అవ్వలేకపోయింది.

3. 2019లో
విరాట్ కొహ్లీ, డివిలియర్స్, పార్థీవ్ పటేల్.. 2019 సీజన్‌లో బెంగళూరు జట్టు తరపున రాణించింది ఈ ముగ్గురే. గురుకీరాత్ మాన్ సింగ్, స్టోయినిస్, శివమ్ దూబే, హెన్రిచ్ క్లాసేన్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నా.. గెలుపు బాధ్యత తీసుకోలేకపోయారు. ఫలితంగా ఆ సీజన్‌లోనూ ఓటమి

4. 2020లో
2020 సీజన్‌లో కూడా ముగ్గురిపైనే డిపెండెన్స్. విరాట్ కొహ్లీ, డివిలియర్స్, దేవదత్ పడిక్కల్. మిడిల్ ఆర్డర్ మళ్లీ ఫెయిల్. ఆరోన్ ఫించ్, శివమ్ దూబే, మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్ ఉన్నా పెద్ద గొప్పగా ఆడిందేం లేదు. ఫలితంగా ఎలిమినేషన్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది.

5. 2022లో
లాస్ట్ సీజన్‌లోనూ బెంగళూరు జట్టు హెవీగా డిపెండ్ అయింది కూడా ముగ్గురి మీదే. కొహ్లీ, డూప్లెసిస్, గ్లెన్ మార్క్. నిజానికి లాస్ట్ సీజన్‌లో కొహ్లీ, డూప్లెసిస్ బెస్ట్ పర్ఫామెన్స్ చేయలేకపోయారు. సో, వీళ్లు ఆడకపోతే.. జట్టులో ఇంకెవరూ సరిగా ఆడరనే అర్థం. ఊహించినట్టుగానే మహిపాల్, షాబాజ్ నిరాశపరిచారు. రజత్ పటీదార్ బాగానే ఆడినప్పటికీ… కొహ్లీ, డూప్లెసిస్, గ్లెన్ మార్క్‌పైనే ఓవర్ డిపెండ్ అయ్యే సరికి రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓడింది బెంగళూరు జట్టు. 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×