BigTV English

ODI World Cup 2023: ఆ ఒక్కటి అధిగమిస్తే కప్పు ఇండియాదే.. రికీ పాంటింగ్ జోస్యం!

ODI World Cup 2023:  ఆ ఒక్కటి అధిగమిస్తే కప్పు ఇండియాదే.. రికీ పాంటింగ్ జోస్యం!

ODI World Cup 2023: ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు చూస్తుంటే ఇండియాకే మెరుగైన అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. అయితే లీగ్ దశల్లో ఆడటం వేరు సెమీఫైనల్, ఫైనల్ లాంటి ఆప్షన్ లేని మ్యాచుల్లో ఆడటం వేరని అన్నాడు. అలాంటి మ్యాచ్ ల్లో ఒత్తిడిని అధిగమించి ఎలా ఆడారనేదానిపైనే ఇండియా విజయం ఆధారపడి ఉందని అన్నాడు.


ఒకవైపు నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. జట్టు మిడిలార్డర్ స్ట్రాంగ్ గా ఉందని అన్నాడు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు, సీనియర్లతో సమతూకంగా ఉందని అన్నాడు. మొదటి నుంచి చివరి వరకు జట్టు చాలా పటిష్టంగా ఉందని అన్నాడు. ఇక స్వదేశంలో ఆడటం భారత్ కి కలిసి వచ్చే అంశమని అన్నాడు. ఇలా అన్నీ చెబుతూనే చివరికి ఈ మాట అన్నాడు. అంటే ఒత్తిడిని అధిగమించే సమయంలో మనవాళ్లు చేతులెత్తేయకుండా ఆడగలిగితే ఇండియాని మించిన జట్టు ప్రస్తుతానికైతే లేదని తేల్చేశాడు.

రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం ఇండియాకి కలిసి వచ్చే అంశమని అన్నాడు. తను ఓపెనర్ గా వచ్చి జట్టుపై ఒత్తిడినంతా చిటికెన వేలుతో తీసేస్తున్నాడని అన్నారు.
ఇది చివరి వరకు కొనసాగితే వరల్డ్ కప్ ఇండియాదేనని తేల్చి చెప్పేశాడు.


అయితే కొందరు మాత్రం 2019 వరల్డ్ కప్ ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా రోహిత్ శర్మ లీగ్ దశలో వరుసగా నాలుగు సెంచరీలు చేసి మంచి ఊపు మీద కనిపించాడు. సరిగ్గా ఆడాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కే అవుట్ అయిపోయాడని గుర్తు చేస్తున్నారు.

మరికొందరు ఏమంటున్నారంటే…తాజా వరల్డ్ కప్ ని గుర్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో
2 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన దశ నుంచి మ్యాచ్ ని గెలిపించిన కొహ్లీ, రాహుల్ ను మరిచిపోవద్దు..ఇండియన్స్ ఎప్పుడో ఒత్తిడిని అధిగమించేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే అతి ఆత్మవిశ్వాసం కొంప ముంచుతుందని మరొకరు దానికి బదులిచ్చారు.

మొత్తానికి రికీ పాంటింగ్ కామెంట్లు నెట్టింట భలేగా హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లకు మంచి పని పెట్టాయి.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×