BigTV English

Israel-Palastine War : ఇజ్రాయెల్‌, పాలస్తీనా భీకర పోరుతో మృత్యుకేళి.. ఆసుపత్రిపై బాంబు దాడి

Israel-Palastine War : ఇజ్రాయెల్‌, పాలస్తీనా భీకర పోరుతో మృత్యుకేళి.. ఆసుపత్రిపై బాంబు దాడి

Israel-Palastine War : ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య భీకరపోరులో మారణహోమం తాండవిస్తోంది. మృత్యుఘోషతో భయంకర వాతావరణం నెలకొంది. ఇప్పటికే వేలాది మంది మరణించగా.. తాజాగా గాజా ఆస్పత్రిలో జరిగిన పేలుడుధాటికి 500లకుపైగా మృత్యువాతపడ్డారు. అయితే,.. ఈ దాడులకు ఇజ్రయెల్‌ కారణమని హమాస్‌లు ఆరోపిస్తుంటే.. ఇదంతా హమాసీల పనేనని ఇజ్రయెల్‌ ఆరోపిస్తోంది.


ఇరు దేశాల మధ్య యుద్ధంతో గాజా ప్రాంతం నెత్తురోడుతోంది. పట్టణ కేంద్రంలోని ఆస్పత్రిలో పేలుడు సంభవించి 500ల మంది మరణించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ దాడిపై ఇటు ఇజ్రాయెల్, అటు హమాసీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులే కారణమన్న హమాస్‌ల ఆరోపణలను తిప్పికొట్టింది ఇజ్రాయెల్‌. దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని చెబుతోంది. మరోపక్క ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడులను ఖండించారు. ఇది క్రూరమైన తీవ్రవాదుల దాడి అని అన్నారు.

మరోవైపు ఈ దాడికి బాధ్యత అమెరికాదేనని హమాస్‌ నాయకులు ఇస్మాయిల్‌ హనియే చెబుతున్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తోందని.. ఆస్పత్రిపై దాడిని చూస్తే.. శత్రువు ఓటమి భయంతో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతోందని ఇస్మాయిల్‌ పేర్కొన్నాడు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×