BigTV English
Advertisement

Delhi Capitals: హెడ్ కోచ్‌గా తప్పుకున్న రిక్కీ పాంటింగ్.. డీసీ కామెంట్ ఏమిటంటే?

Delhi Capitals: హెడ్ కోచ్‌గా తప్పుకున్న రిక్కీ పాంటింగ్.. డీసీ కామెంట్ ఏమిటంటే?

Ricky Ponting: ఢిల్లీ క్యాపిటల్స్, హెడ్ కోచ్‌ రిక్కీ పాంటింగ్ శనివారం వేరు బాట పట్టారు. ఏడేళ్ల తర్వాత హెచ్ కోచ్‌గా రిక్కీ పాంటింగ్ తప్పుకున్నారు. ఆయన సేవలు మరిచిపోలేమని ఢిల్లీ క్యాపిటల్స్ ఎమోషనల్ పోస్టు పెట్టింది. హెడ్ కోచ్‌గా రిక్కీ పాంటింగ్‌ను తప్పిస్తున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది.


‘మీరు మా హెడ్ కోచ్‌గా మారిపోతున్న విషయాన్ని అక్షరాల్లో వ్యక్తీకరించలేకపోతున్నాం. ప్రతి సవాలులో మీరు చెప్పిన కేర్, కమిట్‌మెంట్, యాటిట్యూట్, ఎఫర్ట్ విషయాలను మరిచిపోలేం. ఏడేళ్ల కాలాన్ని ఈ నాలుగు మాటల్లో చెప్పొచ్చు’ అని ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్‌లో పోస్టు చేసింది.

రిక్కీ పాంటింగ్‌కు భావోద్వేగ వీడ్కోలును ఫ్రాంచైజీ చెబుతున్నప్పటికీ ఆయనపై డీసీకి అసంతృప్తి ఉన్నదని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. రిక్కీ పాంటింగ్ ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నప్పటికీ కప్ ఇది వరకు రాలేదు. 2021లో ఒక్కసారి డీసీ ఫైనల్స్‌కు వెళ్లింది. మళ్లీ ఆ తరహా పర్ఫార్మెన్స్‌ను ఈ టీమ్ ప్రదర్శించలేకపోయింది.


ఏడేళ్లలో టీమ్ ఒక్కసారి కూడా కప్ గెలుచుకోలేకపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్.. రిక్కీ పాంటింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే సపోర్ట్ స్టాఫ్‌ను ప్రక్షాళన చేయదలిచినట్టు ఆయనకు ముందే తెలియజేసినట్టు సమాచారం. రిక్కీ పాంటింగ్ వచ్చే ఏడాది కొనసాగలేరని ముందే సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. వేలం ప్రక్రియ, టీమ్ బిల్డింగ్‌లో హెడ్ కోచ్ ఎక్కువగా ఇన్వాల్వ్ కావాని డీసీ మేనేజ్‌మెంట్ భావించింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి కొన్ని వారాలు ముందుగా వస్తే సరిపోదనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టు తెలిసింది.

2025లోనే మెగా వేలం ప్రక్రియ ఉన్నది. మరి వచ్చే సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కోసం కొత్త హెడ్ కోచ్‌ గా ఎవరిని తీసుకుంటారన్నది ఇంకా తెలియరాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్లు జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్‌లు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల తొలినాళ్లలో భేటీ కావాల్సి ఉన్నది. ఈ సమావేశంలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రెండు సార్లు ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా వచ్చారు. అప్పటి నుంచి టీమ్‌ను బిల్డ్ చేసుకున్నారు. 2021లో టీమ్‌ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లగలిగారు. కానీ, ఆ తర్వాత ఆ స్థాయి పర్ఫార్మెన్స్‌ను చూపించలేకపోయారు. టీమ్‌లో చాలా ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. శ్రేయస్ అయ్యార్‌ను కెప్టెన్‌గా, ఆ తర్వాత ఆ బాధ్యతలను రిషబ్ పంత్‌కు అప్పగించడంలో కూడా కీలకంగా పాంటింగ్ ఉన్నట్టు చెబుతుంటారు. శ్రేయస్‌ను కెప్టెన్‌గా నియమించాక మంచి ఫలితాలు వచ్చాయి.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×