E-Paper
Advertisement

Father of Rinku Singh : సిలిండర్లు మోసి.. క్రికెట్ నేర్పించిన తండ్రి..!

Father of Rinku Singh : సిలిండర్లు మోసి.. క్రికెట్ నేర్పించిన తండ్రి..!
Advertisement

Father of Rinku Singh : రింకూ సింగ్.. టీమ్ ఇండియాలో యువ సంచలనం. కానీ తన కుటుంబ నేపథ్యం, తన తండ్రి పడుతున్న కష్టం చూస్తే ఎవరికైనా కన్నీరు రాక తప్పదు. రింకూ సింగ్ తండ్రి ఇంటింటికి సిలిండర్లు మోస్తూ ఐదుగురు పిల్లల్ని చదివిస్తున్నాడు. వారిలో మూడోవాడైన రింకూ సింగ్ క్రికెట్ లో చురుగ్గా ఉండటంతో అతనికి దగ్గరుండి ఎంతో కష్టపడి కోచింగ్ ఇప్పించాడు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడ్డారు.

ఉత్తర ప్రదేశ్ లోని ఆలిగఢ్ పట్టణం రింకూ సింగ్ జన్మస్థలం. ప్రస్తుతం రింకూ సింగ్ తండ్రి ఖాన్ చందర్ సింగ్ సిలిండర్లు మోస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆయన ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు.   కొడుకు ప్రయోజకుడైనా సరే, తండ్రి తను చేస్తున్న వృత్తిని వదిలిపెట్టలేదు. అతని వృత్తి నిబద్ధతతకు జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

రింకూ సింగ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. అందువల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. జాతీయ జట్టులో ఆడినప్పుడు కూడా ప్రతి మ్యాచ్ కు గ్రేడ్స్ ను బట్టి నిర్ణయిస్తారు. ఏ ప్లస్, ఏ, బి, సి గ్రేడ్స్ ఉంటాయి. ఇందులో ఏ ప్లస్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ కేటగిరిలో వాళ్లకి రూ. 5కోట్లు, బీ కేటగిరి వాళ్లకి రూ.3 కోట్లు, సి కేటగిరి వారికి రూ.1 కోటి ఉంటుంది.

అందువల్ల రింకూ సింగ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్టు చెప్పాలి. అందువల్ల తండ్రిని చాలాసార్లు మీరు రెస్ట్ తీసుకోండి అని రింకూ సింగ్ రిక్వెస్ట్ చేశాడంట. కానీ తను మాత్రం నవ్వుతూ ఆ మాటను కొట్టి పారేస్తారని చెబుతున్నాడు. ఓపిక ఉన్నంతవరకు నేను చేస్తానని, అందులోనే తనకు విశ్రాంతి అని చెబుతున్నారని ఒక ఇంటర్వ్యూలో రింకూ అన్నాడు.

Advertisement

తన తండ్రికి చేసే పని పట్ల ఎంతో ప్రేమ ఉందని, అదే మాకు నేర్పించారని అన్నాడు. చిన్నతనం నుంచి తండ్రిని చూసే పెరిగాను. ఆయనకి పనిపట్ల ఉన్న అంకిత భావం, ప్రేమ, నిబద్ధతత ఇవన్నీ మేం కూడా నేర్చుకున్నామని అన్నాడు.అంత అంకిత భావంతో క్రికెట్  ఆడటానికి, చిన్నతనం నుంచి తండ్రి చూపిన మార్గమే కారణమని అన్నాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్ తండ్రిని నెట్టింట అందరూ గ్రేట్ ఫాదర్ అని కొనియాడుతున్నారు.

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

Big Stories

Advertisement
×