Rinku Singh: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand, 1st T20I ) మధ్య నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో రింకు సింగ్ అదరగొట్టాడు. అందువచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేదు రింకు సింగ్. నిన్నటి మ్యాచ్ ఫినిషర్ రోల్ ప్రదర్శించాడు. కేవలం 20 బంతులలోనే 40 పరుగులు సాధించాడు. అంతేకాదు ఇండియాను వన్డే సిరీస్ లో వేధించిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ బౌలింగ్ లో ఏకంగా 20 కి పైగా పరుగులు సాధించాడు రింకు సింగ్ ( Rinku Singh). డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) వేసిన చివరి ఓవర్ లో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు కూడా సాధించాడు. దీంతో డారిల్ మిచెల్ వేసిన ఓవర్ లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. వన్డే సిరీస్ లో ఇండియాను ఆడుకున్న ఈ గుండోడి బౌలింగ్ ను రింక్ సింగ్ చీల్చి చెండాడు. ఈ నేపథ్యంలోనే రింకు సింగ్ బ్యాటింగ్ పై అతని కాబోయే ప్రియా సరోజ్ ( Priya Saroj ) తెగ సంబరపడిపోయింది. అంతేకాదు రింకు సింగ్ కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్నటి రోజున మొదటి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు వాడిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దారుణంగా ఓడిపోయింది న్యూజిలాండ్. అయితే ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రింకు సింగ్ ఫినిషర్ గా తన రోల్ ప్రదర్శించాడు. 20 బంతుల్లోనే ఏకంగా 44 పరుగులు సాధించాడు.
ఇందులో మూడు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. 220 స్ట్రైక్ రేటుతో అదరగొట్టాడు రింక్ సింగ్. అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ వేయడం జరిగింది. అయితే అతని బౌలింగ్లో రింకు సింగ్ రెచ్చిపోయి ఆడాడు. రెండు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు సాధించాడు. దీంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో 21 పరుగులు సాధించాడు రింకు సింగ్. అయితే వన్డేలో ఇండియాను చీల్చి చెండాడు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్. ఈ నేపథ్యంలోనే ఆ గుండోడి పై రింకు సింగ్ రివేంజ్ తీర్చుకున్నాడు.
ఇండియా తరఫున చివరి ఓవర్ లో అదరగొట్టిన రింకు సింగ్ కు ఆయనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ ముద్దుల వర్షం కురిపించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చినట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వాస్తవంగా ఆమె ఈ నాగపూర్ టి20 మ్యాచ్ కు రాలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు కొంతమంది.
Rinku Singh went berserk in the final over against Daryl Mitchell, remaining unbeaten on 44 off just 20 balls after smashing 21 runs in the over.
📸: Jio Star | #RinkuSingh #INDvsNZ #Cricket #DarylMitchell pic.twitter.com/5eFy8bkFQj
— CricTracker (@Cricketracker) January 21, 2026