Shubman Gill Drops Daryl Mitchell Catch: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs India, 2nd ODI) మధ్య వెల్లింగ్టన్ వేదికగా ( Hnry Stadium, Wellington) రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాలో పడింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ (Daryl Mitchell ) ఇచ్చిన ఓ సింపుల్ క్యాచ్ ను టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill ) నేల పాలు చేశాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఇండియన్ ఫ్యాన్స్.. శుభమాన్ గిల్ పై ఫైర్ అవుతున్నారు. అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా పచ్చి బూతులు తిట్టినట్టు వీడియోలు వైరల్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs India, 2nd ODI) మధ్య జరుగుతున్న రెండవ వన్డే సందర్భంగా 17వ ఓవర్ అన్షుల్ కాంబోజ్ వేశాడు. ఈ క్రమంలో స్ట్రైకింగ్ లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని మిడ్ ఆఫ్ వైపు బంతి గాల్లోకి లేచింది. ఆ సందర్భంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ సింపుల్ గా వచ్చిన ఆ క్యాచ్ వదిలేసాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్ వదిలేయడంతో బౌలర్ అన్షుల్ కాంబోజ్ తో పాటు క్రికెట్ అభిమానులు అందరూ నిరాశ చెందారు. ఈ క్యాచ్ విషయంలో గిల్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.
ఈ క్రమంలో శుభమాన్ గిల్ పై మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పచ్చి బూతులు తిట్టినట్టు కొంత మంది వీడియోలు చేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ లో క్యాచ్ మిస్ చేసినందుకు కెప్టెన్ గిల్ ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కడా బూతులు తిట్టలేదు. క్యాచ్ మిస్ కావడంతో సైలెంట్ గా ఉండిపోయారు. కానీ గతంలో కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్ లో పొరపాటు చేసినప్పుడు రోకో సీరియస్ అయిన వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కుల్దీప్ స్థానంలో గిల్ ను తిట్టినట్టుగా వీడియోను మార్ఫింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కానీ గిల్ క్యాచ్ మిస్ చేయడంతో జాగ్రత్తగా ఆడిన డారిల్ మిచెల్ అర్థ సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. పీకల్లోతు కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్ ను ఒంటి చేత్తో కాపాడుతున్నాడు. కాగా ఇప్పటి వరకు 5 వికెట్లు కోల్పోయిన కివీస్ స్కోరు 100 దాటింది.
SHUBHAMAN GILL dropped DARRYL MITCHELL. #NZvsIND #NZvIND pic.twitter.com/G98MWBfT91
— Rustom Imran (@Rustomimran2) November 7, 2026
Shubman Gill deserves the same treatment that Virat Kohli and Rohit Sharma gave Kuldeep Yadav for dropping an absolute sitter of Daryl Mitchell! 😂
I wish Virat and Rohit would join Anshul Kamboj in giving Gill the same treatment! pic.twitter.com/S0gvXx897F
— Sonu (@Cricket_live247) November 7, 2026