Sanjay Manjrekar 40cr controversy in the IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2028 టోర్నమెంట్ (Indian Premier League 2028 Tournament) నేపథ్యంలో మన టీమ్ ఇండియా ఆటగాళ్లు రూ.40 కోట్లు ఫ్రాంచైజీలను డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) స్పందించాడు. రూ.40 కోట్లు అడగడానికి అసలు సిగ్గుందా..? మీకే అంతలా డబ్బులు ఇస్తే, ఫ్రాంచైజీలు అడుక్కుతినాలా ? అంటూ ప్రశ్నించారు. ఒక్కసారి మీ ముఖాలు అద్దంలో చూసుకోండి అంటూ నిప్పులు చెరిగాడు. ఐపీఎల్ లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే వాడే లేడంటూ విమర్శలు చేశాడు. అడిగితే న్యాయంగా ఉండాలి కానీ.. దోపిడి చేయకూడదని మండిపడ్డాడు. దీంతో రూ.40 కోట్ల వ్యవహారంపై సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.