BigTV English

Rishabh Pant: జిమ్‌లో పంత్ కసరత్తులు.. ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న కీపర్..

Rishabh Pant: జిమ్‌లో పంత్ కసరత్తులు.. ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న కీపర్..
Advertisement

Rishabh Pant


Rishabh Pant Workout Ahead Of IPL-2024: ఇండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్, రిషబ్ పంత్, పోటీ క్రికెట్‌కు తిరిగి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ వర్కౌట్ వీడియో పోస్ట్ చేశాడు. గత ఏడాది టోర్నమెంట్ 16వ ఎడిషన్‌కు దూరమైన పంత్.. తాజాగా IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించనున్నాడు.

ఎవరికైనా ఎలాంటి ప్రేరణ కావాలంటే.. అట్టడుగు స్థాయిని తాకిన తర్వాత తిరిగి ఎలా బౌన్స్ అవ్వాలో నేర్చుకోవాలనుకుంటే, పంత్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రేరణకు మూలంగా ఉంటుంది. కారు ప్రమాదం తర్వాత పంత్ తన మొట్టమొదటి అప్‌డేట్‌ను పోస్ట్ చేసిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, అతను కోలుకోవడం.. పెద్ద ఎత్తులో వర్కౌట్స్ చేయడం అందరికీ ప్రేరణ కలిగిస్తోంది.


ఢిల్లో ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, ఫిబ్రవరిలో, పంత్ IPL 2024లో పంత్ ఆడనున్నట్లు ధృవీకరించాడు. కారు ప్రమాద గాయాల నుంచి కోలుకున్న పంత్ ఐపీఎల్ ఆడటానికి ఉత్సాహం చూపిస్తున్నాడని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2024లో పంత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని, సీజన్ మొదటి అర్ధభాగం బ్యాటర్‌గా ఆడతాడని ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ గత వారం స్పష్టం చేశాడు.

Read More: Virat Kohli Vamika Photo Viral: లండన్‌ రెస్టారెంట్‌లో వామిక-విరాట్.. ఫోటో వైరల్..

“రిషబ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను పరుగులు చేస్తున్నాడు. అతను తన వికెట్ కీపింగ్ ప్రారంభించాడు. అతను ఐపీఎల్‌కు పూర్తి ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది” అని పార్థ్ జిందాల్ అన్నాడు.

“రిషబ్ IPL ఆడతాడని నేను ఆశిస్తున్నాను. అతను మొదటి మ్యాచ్ నుండి నాయకత్వం వహిస్తాడు. మొదటి ఏడు మ్యాచ్‌లలో మేము అతనిని ఒక బ్యాటర్‌గా మాత్రమే ఆడబోతున్నాము. అతని శరీరం ఎలా స్పందిస్తుందో చూసి, మేము మిగిలిన IPL కోసం ఆలోచిస్తాము” అని పార్థ్ జిందాల్ తెలిపాడు.

Related News

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Mitchell Starc: 176.5 కిమీ వేగంతో స్టార్క్ బౌలింగ్‌..షోయ‌బ్ అక్త‌ర్ 22 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

IND VS AUS: 26 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..చెమ‌టోడ్చిన టీమిండియా..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

Big Stories

×