Big Stories

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Encounter in ChhattisgarhEncounter in Chhattisgarh: దండకారణ్యం నెత్తురోడుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా పలువురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

సోమవారం 8 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు లొంగిపోయాడు. అ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. కాగా ఇటీవలె సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో ఇక మావోయిస్టు మృతిచెందాడు.

Read More: Lokpal: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్..

అటు ఆదివారం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలకు మావోల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దీంతో దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News