Big Stories

Nestle Controversy : నెస్లే వివాదం.. FSSAI ఏమంటుందంటే?

Nestle Controversy : గ్లోబల్ ఫుడ్ అండ్ బేవరేజీ దిగ్గజం నెస్లే గతంలో ఎన్నో వివాదాలతో పాటు వార్తల్లో నిలిచిన ఫాస్ట్‌ మూవీంగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీ. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ఉత్పుత్తుల్లో చక్కెర కంటెట్ ఎక్కువగా ఉందని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రత నియంత్రణ సంస్థ నెస్లే యొక్క సెరెలాక్ బేబీ ఆహార పదార్థాల నమూనాలను దేశం మొత్తం సేకరించే పనిలో ఉన్నట్లుగా తెలిపింది.

- Advertisement -

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) CEO G కమల వర్ధన్ రావు ఫుడ్ ఫోర్టిఫికేషన్‌పై ASSOCHAM కార్యక్రమంలో మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నెస్లే యొక్క సెరెలాక్ బేబీ ఆహార పదార్థాల ఉత్పత్తుల నమూనాలను సేకరిస్తున్నాము. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 15-20 రోజులు పడుతుంది. FSSAI అనేది ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిపాలన క్రింద ఉన్న చట్టబద్ధమైన సంస్థ అని తెలియజేస్తున్నా అన్నారు.

- Advertisement -

Also Read : పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

నెస్లే బేబీ ఫుడ్ ఉత్పత్తులలో అధిక చక్కెర కంటెంట్ గురించి ఆందోళనలు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ మరియు నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ద్వారా స్విస్ NGO పబ్లిక్ ఐ హాస్ ప్రచురించిన గ్లోబల్ రిపోర్ట్‌ను గమనించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.

గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం నెస్లే ఐరోపా మార్కెట్ కంటే తక్కువ అభివృద్ధి చెందిన దక్షిణాసియా దేశాలైన ఆఫ్రికా, భారత్, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో తక్కువ క్వాలిటీ కలిగిన బేబీ ఉత్పత్తులను విక్రయిస్తోందని పేర్కొంది. అయితే నెస్లే ఇండియా పిల్లల ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీపడదని, గత ఐదేళ్లలో దేశంలోని బేబీ ఫుడ్ ఉత్పత్తులలో వెరైటీని బట్టి యాడ్ షుగర్‌ను 30 శాతం తగ్గించామని తెలిపింది.

Also Read : పీఎం కిసాన్ యోజన.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు!

అంతకు ముందు ASSOCHAM కార్యక్రమంలో ప్రసంగిస్తూ FSSAI CEO మానవ ఆరోగ్యానికి ఆహారాన్ని బలపరిచే ఆహారమని వెల్లడించారు. బియ్యం కంటే మినుములు, ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను చేర్చాలని పిలుపునిచ్చారు.గత కొన్నేళ్లుగా ఎఫ్‌ఎంసిజి కంపెనీలు వివిధ రకాల మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ప్రవేశపెట్టాయని, దేశంలో పోషకాహార పదార్థాలను మరింత విస్తరించవచ్చని ఆయన అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News