BigTV English

Ritika, Anushka Sharma Emotional Tweets: మాకెంతో బాధగా ఉంది.. రితికా, అనుష్కల భావోద్వేగ ట్వీట్స్

Ritika, Anushka Sharma Emotional Tweets: మాకెంతో బాధగా ఉంది.. రితికా, అనుష్కల భావోద్వేగ ట్వీట్స్

Ritika, Anushka Sharma Emotional Tweets: టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా క్రికెటర్ల భావోద్వేగాలతో ఆ స్టేడియమంతా నిండిపోయింది. అందరూ ఎంత ఒత్తిడిని ఎదుర్కొని ఆడారో, వారి మనసుల్లో ఎంత బాధ గూడుకట్టుకుని ఉందనేది ప్రపంచానికి తెలిసింది. వారూ మనుషులే, మర మనుషులు కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క మ్యాచ్ ఓడిపోతే, వారిని నిందించడం లాంటివి ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు.


ఇకపోతే ఇంతటి హైవోల్టేజీ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఒక పోస్ట్ పెట్టింది. అలాగే అనుష్క పెట్టిన పోస్టుకి విరాట్ ఎమోషనల్ అయ్యాడు. ఇంతకీ రోహిత్ భార్య రితికా ఏం రాసుకొచ్చిందంటే.. ఇంతటి గొప్ప వ్యక్తికి భార్య అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నీ కల. దీనికోసం ఎన్ని రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపావో నాకు తెలుసు. టీ 20 ప్రపంచకప్ కోసం నీ మనసుని, శరీరాన్ని ఎంత బాధపెట్టావో కూడా తెలుసు.

ఈ నిర్ణయం.. నీ మనసుకెంతో కఠినంగా అనిపించినా, భారత క్రికెట్ కి మంచి జరుగుతుందనుకుంటే, అదెంతటి త్యాగమైనా నువ్వు చేస్తావు. అయినా టీ 20 క్రికెట్ కి వీడ్కోలు పలకడం నాక్కూడా బాధగా ఉంది. అయినా తప్పదు.. నీతో పాటే నా ప్రయాణం అని రాస్తూ.. చివరిగా ఐ లవ్ యూ సోమచ్ అని రాసింది.


ఇక అనుష్క అయితే విరాట్ ని ఉద్దేశిస్తూ.. భారత క్రికెట్ నుంచి విరాట్ ను విడదీసి చూడలేమని రాసింది. కానీ నేడు టీ 20 నుంచి విడిపోతున్నాాడు. నిన్నెప్పుడూ నేనూ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నా సొంతమైనందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను. ఒక గ్లాస్ చల్లని నీళ్లతో విజయాన్ని ఆస్వాదించు అని రాసింది.

Also Read: ఇద్దరిలో గెలుపెవ్వరిది? టీమ్ ఇండియా కోత్త కోచ్ ఎవరు?

అయితే విరాట్ కూడా ఎమోషన్ అయ్యాడు. నీ వల్లనే, నేను ఫైనల్ ఆడగలిగాను. అంతటి మోరల్ సపోర్ట్ ఇస్తావు. కష్టంలో వెన్నంటే ఉంటావు. నా లోపాలను నిస్సందేహంగా చెప్పగలవు. ఈ విజయం నాది మాత్రమే కాదు, నీది కూడా అంటూ రాసుకొచ్చాడు.

కాకపోతే చాలామంది నెటిజన్లు అనేమాటేమిటంటే, అనుష్క ఎందుకు ఒక గ్లాసు చల్లని నీళ్లతో ఎంజాయ్ చేయమని కొహ్లీకి చెప్పింది. అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే మనవాడు మ్యాచ్ గెలిచిన రోజు రాత్రి ఫుల్ ఎంజాయ్ చేస్తాడని భయపడి అలా అన్నాదా? అని అంటున్నారు. కొహ్లీ మందు మానేశాడని కొందరంటే, అలాగైతే సెమీఫైనల్ కి రోహిత్ బాధపడుతుంటే.. బ్రో చీర్స్ అని ఎందుకన్నాడు? చీర్స్ అని ఎక్కడంటారో తెలుసా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నెట్టింట ఇదొక టాపిక్ వైరల్ అయ్యింది.

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Big Stories

×