Big Stories

Hardik Pandya: నెట్టింట ఫైటింగ్.. రోహిత్ ను పరోక్షంగా విమర్శించిన హార్దిక్

Hardik Pandya-Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి పడుతూ లేస్తూ ఆడుతున్న ముంబయి జట్టు తాజాగా రాజస్థాన్ పై ఓడిపోయింది. దీంతో మళ్లీ పాండ్యాపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇన్నాళ్లూ సంయమనం పాటించిన హార్దిక్ ఈసారి మ్యాచ్ ఓటమిపై కొంచెం హద్దులు దాటి మాట్లాడాడు. ఓపెనర్ రోహిత్ శర్మని టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శించాడు. దీంతో నెట్టింట మళ్లీ ఫైటింగ్ మొదలైంది.

- Advertisement -

ఇంతకీ హార్దిక్ ఏమన్నాడంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటా వైఫల్యం చెందామని అన్నాడు. రాజస్థాన్ రాయల్స్  బ్రహ్మాండంగా ఆడిందని కితాబిచ్చాడు. ఇక ముంబయి జట్టు గురించి చెబుతూ జట్టులో అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారని అన్నాడు. ఎవరినీ నేను నిందించలేనని తెలిపాడు.

- Advertisement -

మేం ప్రారంభంలోనే ఇబ్బందుల్లో పడ్డామని అన్నాడు. అంటే ఓపెనర్స్ సరిగా ఆడలేదని చెప్పకనే చెప్పాడు. వారిలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కేవలం 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ డక్ అవుట్ అయ్యాడు. అయితే 2024 సీజన్ లో రోహిత్ శర్మ 8 మ్యాచ్ లు ఆడి 303 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది.

Also Read: ఐపీఎల్ ఒకవైపు రికార్డులు.. మరోవైపు విమర్శలు

ఇంతవరకు ఐపీఎల్ లో 6, 514 పరుగులు చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో టాప్ ఫోర్ బ్యాటర్ గా ఉన్నాడు. ఐదుసార్లు కెప్టెన్ గా ఉండి ముంబయికి ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్నాడు.అలాంటి తనని డీ గ్రేడ్ చేస్తూ హార్దిక్ మాట్లాడాడు. అంతేకాదు ఇప్పుడప్పుడే నేను మా వాళ్ల గురించి బయటకి చెప్పలేనని కూడా అన్నాడు.

దీంతో మళ్లీ ఈ మాటలు నెట్టింట నిప్పు పుట్టించాయి. నెమ్మదిగా సద్దుమణిగిన రోహిత్ అభిమానులకు హార్దిక్ మళ్లీ పనిపెట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాజస్థాన్ మ్యాచ్ లో  కెప్టెన్ గా, ఆటగాడిగా కూడా హార్దిక్ విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్లు కూడా అదే మాట అనడం నెట్టింట కాక పుట్టిస్తోంది.

అంతేకాదు బుమ్రా ఉండగా ఓపెనింగ్ బౌలింగ్ నువ్వు చెయ్యడం ఏమిటి? అని కూడా పాండ్యాని ప్రశ్నిస్తున్నారు. అందువల్లే ప్రత్యర్థి ఆటగాళ్లు క్రీజులో కుదురుకుంటున్నారని, తర్వాత బాది పడేస్తున్నారని అంటున్నారు. రాబోవు రోజుల్లో బుమ్రా, రోహిత్ లను సాగనంపడానికి పాండ్యా కుట్ర చేస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఈ మాటలతో ముంబై టీమ్ రెండు గ్రూప్ లుగా విడిపోయిందనే వాదనలు మరింత ఎక్కువవుతున్నాయి. రోహిత్ గ్రూప్ లో బుమ్రా, సూర్యా, ఆకాశ్ మధ్వాల్ ఇలా కొందరు ఉన్నారు. పాండ్యా గ్రూప్ లో ఇషాన్, పీయూష్ తదితరులున్నారని అంటుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News