BigTV English

Hardik Pandya: టీ 20 వరల్డ్ కప్ నుంచి.. హార్దిక్ అవుట్?

Hardik Pandya: టీ 20 వరల్డ్ కప్ నుంచి.. హార్దిక్ అవుట్?

India T20 World Cup squad Hardik Pandya’s place Big Talking Point: అవకాశాలు ఎల్లవేళలా రావు. వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నలుగురితో సర్దుకుపోవాలి. అంతేగానీ ఎదిరిస్తే చివరికి మనమే చిక్కుల్లో పడతాం. ఇప్పుడదే పరిస్థితి హార్దిక్ పాండ్యాకు వచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అన్నిదేశాలు తమ జట్లను మే 1న ప్రకటించాల్సి ఉంది. అందులో టీమ్ ఇండియా కూడా ఉంది. ఇప్పుడు టీమ్ సెలక్షన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు.


అంటే తనకి పూర్తి స్వేచ్ఛ ఉండదు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అంతా చూసుకుంటుంది. కానీ ఒకట్రెండు అవకాశాలు ఇస్తుంది. తనకి నచ్చినవారిని ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తుంది. అలాగే ఒకరిద్దరిని తీసే అవకాశం కూడా ఉంటుంది.

అలాంటి పరిస్థితి వస్తే  హార్దిక్ పాండ్యా బదులు రిషబ్ పంత్ కావాలి.. అనే రోహిత్ అడిగే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే తను ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ముంబయి ఇండియన్స్ లో అంత రచ్చ జరిగింది కాబట్టి, తను ఓపెన్ కాడు. అలాగైతే తన వ్యక్తిత్వం దెబ్బతింటుంది.


Also Read: ముంబై కో(మే)లుకుంటుందా? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్

అందుకే ఇలా చేసే అవకాశాలున్నాయి. అదేమిటంటే ఇప్పుడు జరిగే ఎంపిక అంతా కూడా ఐపీఎల్ లో ఆటగాళ్ల పెర్ ఫార్మెన్స్ మీదే జరుగుతోంది. గత చరిత్రను పరిగణలోకి తీసుకోవడం లేదు. అందువల్ల ప్రస్తుతం ముంబై కెప్టెన్ గా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పెర్ ఫార్మెన్స్ అస్సలు బాగుండటం లేదు.

దీంతో బీసీసీఐ తమంతట తాము తప్పిస్తే మాత్రం, ఇతను కావాలని తను అడగడు. కామ్ గా ఊరుకుంటాడు. ఒకవేళ ఎంపిక చేస్తే మాత్రం, వద్దని అనడు.  వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ కి ఇవ్వమని అడుగుతాడు. అది న్యాయమైన కోరికగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకుంటుంది.

ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ ప్రవర్తన అంత ఆకట్టుకున్నట్టుగా లేదు. ఒకవేళ వైస్ కెప్టెన్ గా ఇస్తే, కావాలని జట్టుని పక్కదారి పట్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి రోహిత్ శర్మ అండ్ కో ప్రధాన కారణమని తను నమ్ముతున్నాడు. తనకి పేరు రాకుండా చేశారని ఫీల్ అవతున్నాడు. అందుకు బదులుగా టీమ్ ఇండియాలో చిచ్చు రేపితే మొదటికే మోసం వస్తుందని మేనేజ్మెంట్ భావించే అవకాశాలున్నాయి.

రాబోయే రోజుల్లో కాబోయే టీమ్ ఇండియా కెప్టెన్ గా కీర్తి అందుకున్న హార్దిక్ పాండ్యా తీసుకున్న  ఒక్క నిర్ణయం తనని పాతాళంలోకి నెట్టేసింది. ముంబై జట్టులోకి వస్తే వచ్చాడు. రోహిత్ కి కెప్టెన్సీ అప్పగిస్తే గొడవ ఉండేది కాదు. ఫ్రాంచైజీ దగ్గర నుంచి అన్ని పొరపాట్లు జరిగాయి. రేపు టీమ్ ఇండియాలో ఒక వెలుగు వెలిగిన హార్దిక్ పాండ్యా భవితవ్యంపై ఎటువంటి ప్రభావం చూపిస్తోందో చూడాలి.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×