BigTV English

Rohit Sharma New Records : అక్కడ కారు గేర్ మారుస్తాడు.. ఇక్కడ రికార్డులు బ్రేక్ చేస్తాడు

Rohit Sharma New Records : అక్కడ కారు గేర్ మారుస్తాడు.. ఇక్కడ రికార్డులు బ్రేక్ చేస్తాడు

Rohit Sharma New Records : ముంబయి-పుణె హైవే మీద 215 కిమీ వేగంతో వెళ్లిన రోహిత్ శర్మ స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు తను కొట్టిన ఫోర్లు, సిక్స్ లతో వచ్చిన రికార్డ్ చూసి అంతకన్నా ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏమిటంటే ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 87 పరుగులు చేసిన రోహిత్ శర్మ 3 సిక్సులు, 10 ఫోర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో మహామహులెవరికి సాధ్యం కానీ ఒక రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.


వన్డే క్రికెట్ లో ఒక ఏడాదిలో వందకు పైగా ఫోర్లు, 50 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రోహిత్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అయితే అద్భుతమైన టైమింగ్ తో సిక్సర్లు, ఫోర్లు కొట్టే హిట్ మ్యాన్ ఆట తీరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకు గ్రౌండ్ లో ఉండి ప్రత్యక్షంగా చూసే అంపైర్లు కూడా ఆశ్చర్యపోతుంటారు.

90 శాతం బ్యాట్స్ మెన్లు ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని లాగి పెట్టి కొడుతుంటారు. కానీ రోహిత్ అలా కాదు… సింపుల్ గా నిలుచున్న చోటే ఉంటాడు. చక్కగా ఫుట్ వర్క్ తీసుకుంటాడు. సింపుల్ గా బాల్ ని లేపి గ్రౌండ్ అవతల పాడేస్తాడు. ఒకొక్కసారి ఫ్రంట్ పుట్ కి వచ్చినా దాన్ని కూడా బ్రహ్మాండమైన టైమింగ్ తోనే కొడతాడు. అది వెళ్లి గ్రౌండ్ అవతల పడుతుంది.


సింపుల్ గా ఆడితేనే అలా ఉంటుంది..అదే అందరిలా లాగిపెట్టి ఒక్కటి కొడితే స్టేడియం అవతల పడాల్సిందే. ఒకప్పుడు మహ్మద్ అజహరుద్దీన్ కూడా మణికట్టు మాయాజాలంతోనే క్రికెట్ ఆడేవాడు. తను కూడా ఎక్కువ కష్టపడకుండా ఆడేవాడు. రోహిత్ శర్మ దగ్గరకు వచ్చేసరికి మణికట్టు మాయాజాలం కాదుగానీ…టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. అందువల్లే అంత సింపుల్ గా అలవోకగా సిక్స్ లు, ఫోర్లు కొట్టి పారేస్తుంటాడని సీనియర్లు వ్యాఖ్యానిస్తుంటారు.

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు. ఇంతకు ముందు వరుసలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఉన్నాడు. తను 9సార్లు అవార్డు అందుకుంటే, రోహిత్ శర్మ 7 సార్లు తీసుకున్నాడు.

భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచ్ లకు కెప్టెన్ గా  ఉన్న ఘనత సాధించాడు. ఇందులో 74 విజయాలు, 23 పరాజయాలు ఉన్నాయి. రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఒకటి మాత్రం ఫలితం తేలలేదు.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×