Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. కెమెరామెన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ మ్యాచ్ మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని హ్యాండ్స్‌కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్స్‌కు తగిలింది. అయితే దానిని అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ డీఆర్ఎస్‌కు వెళ్లగా.. ఆ సమయంలో కెమెరామెన్ రీప్లే చూపించకుండా చాలా సేపు రోహిత్ శర్మను స్క్రీన్‌పై చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రోహిత్.. ‘‘నన్నెందుకు అంతగనం చూపిస్తున్నావు.. రిప్లై చూపించు’’ అంటూ సీరియస్ అయ్యాడు. అది విని పక్కన ఉన్న క్రికెటర్లు కాసేపు నవ్వుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.