BigTV English

Rohit Sharma gives an update on his injury : ఫ్రాక్చర్ కాదు.. ఎముక జరిగింది!

Rohit Sharma gives an update on his injury : ఫ్రాక్చర్ కాదు.. ఎముక జరిగింది!

Rohit Sharma gives an update on his injury : బంగ్లాదేశ్‌తో​ జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ సందర్భంగా గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ… తన గాయంపై అప్‌డేట్‌ ఇచ్చాడు. తన వేలికి ఫ్రాక్చర్‌ కాలేదని, కాకపోతే ఎముక కాస్త పక్కకు జరిగిందని రోహిత్‌ తెలిపాడు. దేవుడి దయవల్ల వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదన్న హిట్ మ్యాన్… వేలి ఎముక కాస్త పక్కకు జరగడంతో డాక్టర్లు కొన్ని కుట్లు వేసి సరిచేశారని చెప్పుకొచ్చాడు. అందుకే తాను 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చానని, నిజం చెప్పాలంటే చాలా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్‌ కొనసాగించానని వెల్లడించాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ పాజిటివ్‌, నెగెటివ్‌లు ఉంటాయని… కానీ 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఉన్న బంగ్లాను 270 పరుగులు దాటనివ్వడం మాత్రం కచ్చితంగా బౌలర్ల వైఫల్యమే అని అన్నాడు… రోహిత్ శర్మ.


బంగ్లాదేశ్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా కుడి చేతి బొటనవేలికి గాయమైంది. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ అనముల్ హక్… బంతిని డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ అంచుల్ని తాకి సెకండ్‌ స్లిప్‌ దిశగా దూసుకెళ్లింది. స్లిప్‌లో క్యాచ్‌ పట్టబోయిన రోహిత్‌ శర్మ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దీంతో రోహిత్‌ నొప్పితో వెంటనే మైదానాన్ని వీడాడు. అతణ్ని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయించారు. అందులో బొటనవేలు ఫ్రాక్చర్ కాకపోయినా… ఎముక పక్కకు జరిగినట్లు తేలింది. దాంతో వెంటనే ఎముకను యథాస్థానంలోకి తీసుకొచ్చిన డాక్టర్లు… కొన్ని కుట్లు వేశారు.

మ్యాచ్‌లో ఓటమి ఖరారైపోయిందనుకున్న దశలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌ మ్యాన్‌… ఒకవైపు నొప్పిని భరిస్తునే బంగ్లా బౌలర్లను చితగ్గొట్టాడు. టీమిండియా విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా… ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు… రోహిత్ శర్మ. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా… బాల్ మిస్ కావడంతో ఒక్క పరుగు కూడా రాలేదు. మ్యాచ్‌తో పాటు టీమిండియా సిరీస్ కూడా కోల్పోయినా… గాయంతోనే రోహిత్ శర్మ ఆడిన ఆటకు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యాచ్, సిరీస్ పోతే పోయాయి… రోహిత్ ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×