BigTV English

Rohit Sharma: 22 రోజుల్లో 20 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ…బ్రాంకో టెస్టు ఇక జుజుబీ

Rohit Sharma: 22 రోజుల్లో 20 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ…బ్రాంకో టెస్టు ఇక జుజుబీ

Rohit Sharma:  టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండియాకు టి20 వరల్డ్ కప్ తేవడమే కాకుండా జట్టును…. నెంబర్ వన్ స్థానంలో నిలిపిన తోపు కెప్టెన్ రోహిత్ శర్మ. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ రేట్ అందుకుంది రోహిత్ శర్మ మాత్రమే. అలాంటి రోహిత్ శర్మ ఇప్పుడు కొత్త లుక్ లో మెరిశారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు సంబంధించిన.. స్లిమ్ ఫోటోలు వైరల్ గా మారాయి. దాదాపు 20 కిలోలు రోహిత్ శర్మ తగ్గారట. వన్డే వరల్డ్ కప్ 2027 కోసం రోహిత్ శర్మ… ఆగస్టు మొత్తం కష్టపడి… బరువు తగ్గినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హిట్ మాన్ రోహిత్ శర్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read: David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

వన్డే జట్టులో ఛాన్స్ కోసం రోహిత్ శర్మ తిప్పలు


వన్డే జట్టులో ఛాన్స్ దక్కించుకునేందుకు రోహిత్ శర్మ చాలా కష్టపడుతున్నారు. 2027 వరల్డ్ కప్ వరకు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత రిటైర్మెంట్ చేయాలన్నది రోహిత్ శర్మ ఆలోచన. అయితే అప్పటివరకు కచ్చితంగా ఆడాలంటే ఫిట్ గా ఉండాల్సిందే. దీనికి తోడు బ్రాంకో టెస్టులంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి.. తీసుకువచ్చిన ఆ రూల్ కు తగ్గట్టుగానే రోహిత్ శర్మ… ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే మరింత ఫిట్నెస్ గా కనిపించాడు రోహిత్ శర్మ. దాదాపు నెలరోజులు కష్టపడి బరువు తగ్గాడు. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా దూసుకు వెళ్తున్నాడు.

22 రోజుల్లో 20 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ

దాదాపు 22 రోజుల్లోనే 20 కిలోల బరువు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తగ్గాడు. ఆగస్టు 9వ తేదీన అభిషేక్ శర్మ నాయకత్వంలో… రోహిత్ శర్మ ట్రైనింగ్ ప్రారంభించాడు. ఆగస్టు 31 అంటే నిన్నటి వరకు అతని ట్రైనింగ్లో… రోహిత్ శర్మ చాలా కష్టపడ్డాడు. ఫ్యామిలీని పక్కకు పెట్టి పొద్దున అలాగే సాయంత్రం.. వర్కౌట్స్ చేశాడు. అభిషేక్ శర్మ చెప్పిందల్లా చేసి… తన శరీరాన్ని కలిగించేశాడు. ఈ దెబ్బకు 22 రోజుల్లోనే రోహిత్ శర్మ 20 కిలోల బరువు తగ్గాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆగస్టు 9వ తేదీన కాస్త లావుగా కనిపించిన రోహిత్ శర్మ తాజా వీడియోలో మాత్రం స్లిమ్ అయిపోయాడు. బ్లాక్ టీషర్టులో విమానాశ్రయంలో S మెరిశాడు రోహిత్ శర్మ. ఇందులో పొట్ట లేకుండా చాలా స్లిమ్ గా కనిపించాడు. కాగా వన్డే వరల్డ్ కప్ కంటే ముందు రోహిత్ శర్మను… కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే అలా అన్న వాళ్ళ నోర్లు మూయించే… లాగా ఫిట్ గా కనిపించాడు రోహిత్ శర్మ. ఇక ఈ నెల 13న బ్రాంకో టెస్ట్, యోయో టెస్ట్ కు రోహిత్ హాజరు కానున్నారు.

Also Read: IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

 

 

Related News

Sam Billings: ది హండ్రెడ్ లో హ్యాట్రిక్ టైటిల్స్… ధోని, రోహిత్ రికార్డులకు ఎసరుపెట్టిన సామ్ బిల్లింగ్స్

BCCI : రూ. 452 కోట్లకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్.. బీసీసీఐ అదిరిపోయే స్కెచ్?

David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

IPL 2026 : IPL 2026 కంటే ముందే పెను మార్పులు…ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

Big Stories

×