Illu Illalu Pillalu Today Episode September1st: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద వాళ్ళ నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందని బాధపడుతూ ఉంటుంది. సాగర్ నర్మదని ఓదారుస్తాడు.. అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు.. ఇంకా మీ నాన్నకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా అలానే చూసుకుందామని అంటాడు. మా నాన్నకు అయిందని బాధ కాదు మా నాన్నకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆయన మళ్లీ డిప్రెషన్ కి వెళ్తాడు అని నర్మదా అంటుంది. నాకోసం అన్ని వదులుకొని వచ్చిన నీకోసం మీ నాన్న కోసం నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాను అని సాగర్ అంటాడు. నీ మాట నిలకడ లేనిది. ఈరోజు ఈ మాట అంటావు.. రేపు ఇంకొకటి అంటావు. ఏం చెప్తావో నీకే తెలియదు అదే నా బాధ అని అంటుంది.. సాగర్ నీకు మాట ఇచ్చిన ప్రకారం నేను గవర్నమెంట్ జాబ్ కొట్టి చూపిస్తానని అంటాడు. ఇక చందు బాధపడుతూ ఉంటాడు..
బావ భోజనం చేద్దాం రావా అని శ్రీవల్లి అడుగుతుంది. కానీ చందు మాత్రం నేను రాను నువ్వు నన్ను మోసం చేసావని దారుణంగా మాట్లాడుతాడు. ఇంత మోసం చేస్తావని తెలియలేదు. పెళ్లికి ముందు కూడా ఇలానే నన్ను మోసం చేసావా అసలు నేను నమ్మాలంటే నాకు భయమేస్తుందని అంటాడు.. ఆ మాటకు శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ చందు కు కావలసిన లక్ష రూపాయల కోసం అందరిని అడుగుతూ ఉంటాడు.. తన ఫ్రెండ్స్ అందర్నీ అడిగినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే ఈ క్రమంలో విశ్వకు ఆ విషయం తెలుస్తుంది.. దారిలో విశ్వ అడ్డుగా ఉంటాడు. ఏంట్రా లక్ష రూపాయల కోసం ఊరంతా అడుక్కుంటున్నావంట ఇదిగో ఆ లక్ష రూపాయలు అని మొహాన విసిరేస్తాడు.. డబ్బులని విసిరేయడంతో ధీరజ్ కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది.. నిన్ను అడిగానా నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు నువ్వు ఎవడ్రా నాకు ఇవ్వడానికి అని అడుగుతాడు..
నా చెల్లిని పెళ్లి చేసుకునేది డబ్బు కోసమే కదా నీలాంటి వాడు డబ్బులు అమ్మాయిని ఎరగవేసి ప్రేమ పేరుతో మోసం చేస్తుంటారు.. నీ గురించి మాకు తెలీదా అని విశ్వా అంటాడు. బావ బామ్మర్దుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ప్రేమ రావడంతో అక్కడి నుంచి విశ్వా వెళ్ళిపోతాడు. చూసావా నేను నిన్ను డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నానట.. వాడనే మాటలు విన్నావా అని రెచ్చిపోతాడు.. ఆ కళ్యాణ గాడు నిన్ను మోసం చేశాడు కాబట్టే ఏ దారి లేక చచ్చిపోతానంటే నిన్ను బ్రతికించడానికి పెళ్లి చేసుకున్నాను నీ మెడలో తాళి కట్టాను అని అంటాడు..
సరే ఈ విషయం పక్కన పెట్టు నేను చెప్పేది విను అని ప్రేమ ఎంత బతిమిలాడినా కూడా ధీరజ్ వినడు.. ప్రేమను నా జీవితాన్ని నాశనం చేశావు ఆరోజు నీ మెడలో తాళి కట్టుకున్న అంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని నా ఇంట్లో వాళ్ళ దృష్టిలో అటు నీవాళ్ళ దృష్టిలో నేను చెడ్డవాన్ని అయిపోయానని బాధపడతాడు. ప్రేమ నీకు ఒక విషయం చెప్పాలి వింటావా అని అడుగుతుంది.. అసలు ఇదంతా కాదు ఆ కళ్యాణ్ గారిని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి వారిని మీవాళ్లు ముందర పెట్టి, వీడే మీ అమ్మాయిని మోసం చేశాడు డబ్బు నగలతో పారిపోతుంటే నేను పరువు పోతుందని పెళ్లి చేసుకున్నాను అని చెప్పాలని ఉంది అంటాడు.
ధీరజ్ నేను చెప్పేది విను ధీరజ్ అని ఎంత చెప్పినా సరే ప్రేమ మాటను అసలు వినడు. వాడెవడో నేను మోసం చేసే పారిపోతుంటే నీ మెడలో తాళి కట్టి నేను తప్పు చేశానా? తాళి కట్టిన భార్యను వదిలేయమని వాడు అంటున్నాడు చూసావా ఇదంతా నీ వల్లే అని బాధపడతాడు.. నీ మెడలో అనవసరంగా తాళి కట్టి నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ గుండె బద్దలవుతుంది. ధీరజ్ నన్ను భారంగా మోస్తున్నాడా? బరిస్తున్నాడా? అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది..
Also Read : అదంతా కలా?.. చక్రధర్ మాస్టర్ ప్లాన్.. అక్షయ్ ను ఇరికించేసిన అవని..
అటు చందు ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. ఇంకా నువ్వు రాలేదేంటి అని చూస్తున్నాను రా డబ్బులు అరేంజ్ అయ్యాయా అని అడుగుతాడు. ధీరజు చాలామందికి చెప్పానురా కచ్చితంగా ఉదయం లోపల వస్తాయని అంటాడు. శ్రీవల్లి మాత్రం చందు మాట్లాడడం లేదని బాధపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చందు 10 లక్షల మేటర్ ఇంట్లో తెలిసిపోతుందా..? తప్పు చేశాడని నాన్నకు తెలిస్తే తిడతాడని చందు ఇంట్లోంచి వెళ్లిపోతాడా? ప్రేమ కళ్యాణ్ సమస్య నుంచి బయట పడుతుందా? ఏం జరుగుతుందో చూడాలి..