BigTV English

Rohit Sharma: ద్రవిడ్ కంటే ముందు.. రోహిత్ రూ. 5 కోట్లు వదిలేశాడా?

Rohit Sharma: ద్రవిడ్ కంటే ముందు.. రోహిత్ రూ. 5 కోట్లు వదిలేశాడా?

Rohit Sharma offered to give up T20 World Cup Prize Money: ఏమిటి? టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకి బోనస్ గా వచ్చిన రూ.5 కోట్లు వదిలేశాడా? అది కూడా ద్రవిడ్ కంటే ముందు ఇచ్చేశాడా? అని నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. అసలేం జరిగిందని అందరూ ఆరా తీస్తున్నారు. విషయం ఏమిటంటే, టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 15 మంది జట్టుకి తలా రూ.5 కోట్లు చొప్పున ఇచ్చారు. మిగిలిన వారికి స్థాయిని బట్టి ఇచ్చుకుంటూ వెళ్లారు.


అయితే టీమ్ ఇండియాతో పాటు సుమారు 42 మంది సహాయక సిబ్బంది కూడా అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. వీరిలో మసాజర్స్, ఫిజియోలు, త్రోడౌన్ స్పెషలిస్టులు, బౌలింగు, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ లు ఇలా ఎంతోమంది ఉన్నారు. నిజానికి కష్టమంతా వారిదేనని రోహిత్ శర్మ అంటున్నాడు. టీమ్ ఇండియా గెలుపు వెనుక వారి శ్రమ ఎంతో ఉందని చెబుతున్నాడు. మాకన్నా ముందు వారు నిద్ర లేవాలి. గ్రౌండులో మొత్తం అన్నీ సిద్ధం చేయాలి. ఎవరికేం కావాలో అన్నీ రెడీ చేయాలి.

శిక్షణ ప్రారంభమైన దగ్గర నుంచి, వారెంతో శ్రమ పడతారు. అలుపెరగకుండా పరుగులు పెడతారు. మాకు త్రోలు విసురుతారు. బౌలింగు చేస్తారు. ఇంక మసాజర్స్ అయితే వారి కష్టం అంతా ఇంతా కాదని అంటున్నాడు. ఆడిన 11 మంది జట్టుని మరో మ్యాచ్ కి సిద్ధం చేయాలి. వారికి కాళ్ల నొప్పులు, అంతకుముందు మ్యాచ్ ఆడినప్పుడు కలిగిన బాధలను తగ్గించి కొత్త మ్యాచ్ కి సిద్ధం చేయాలని అంటున్నాడు.


ఇవన్నీ చూసిన రోహిత్ శర్మ తనకి ప్రైజ్ మనీగా వచ్చిన రూ.5 కోట్లను తమతో వచ్చిన స్టాఫ్ కి సమానంగా పంచి ఇవ్వమని చెప్పాడంట. ఈ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాహుల్ ద్రవిడ్ కూడా తనకి వచ్చిన రూ.5 కోట్లలో సగం తగ్గించుకున్న సంగతి తెలిసిందే.

Also Read: అయితే, కేకేఆర్ మెంటార్ ద్రవిడ్ కాదా?

గురుశిష్యులు ఇద్దరూ ఆటలోనే కాదు, మానవత్వంలో కూడా ఆదర్శనీయులుగా ఉన్నారని పలువురు కొనియాడుతున్నారు. అంతేకాదు రోహిత్ శర్మని చూసి గురువును మించిన శిష్యుడని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×