BigTV English

Rohit Sharma : రికార్డుల పిచ్చి వదిలిద్దామనుకున్నా.. మనసులోని మాట బయటపెట్టిన రోహిత్..!

Rohit Sharma : రికార్డుల పిచ్చి వదిలిద్దామనుకున్నా.. మనసులోని మాట బయటపెట్టిన రోహిత్..!
Rohit Sharma latest news

Rohit Sharma latest news(Sports news headlines):


2019 వరల్డ్ కప్ లో నేను 5 సెంచరీలు చేశాను. ఏం జరిగింది? టోర్నమెంటులో ఓడిపోయాం. ప్రపంచకప్ విజయం లేకుండా శతకాలు, రికార్డులు సాధించడం అర్థరహితమని అన్నాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో రోహిత్ శర్మ మాట్లాడాడు. మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తన మనసులోని మాటలను నిర్భయంగా తెలిపాడు.

నేను కెప్టెన్ గా వచ్చిన తర్వాత.. ముందీ గణాంకాల పిచ్చిని వదలగొట్టాలని చూశాను. కొంత ప్రయత్నం చేశాను. గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత స్వేచ్ఛగా ఆడాలి. రికార్డుల కోసం ఆడితే, మ్యాచ్ లో ఫీల్ తగ్గిపోతుందని అన్నాడు. నిజానికి ఎవరైనా సరే, రికార్డుల కోసం కాదు.. జట్టు విజయం కోసం ఆడాలని అన్నాడు. అదే నేర్పిద్దామని ఇన్నాళ్లూ ప్రయత్నించానని అన్నాడు.


ఇప్పుడు జనం ఎవరూ రికార్డులను పట్టించుకోవడం లేదని అన్నాడు. మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిపాడు. నిజానికి మన దేశంలో క్రికెట్ అభిమానులు రికార్డుల గురించి ఎక్కువగానే మాట్లాడతారని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రతీ పనికిమాలిన దానిని ఒక రికార్డుగా పరిగణిస్తున్నారు.వాటిని చూస్తుంటే మాకే నవ్వు వస్తోందని అన్నారు. రికార్డులను వేలంవెర్రిగా మార్చేశారని అన్నాడు.  

మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నిర్వహించడం కొంచెం కష్టమేనని అన్నాడు. కానీ బాధ్యతలు వచ్చిన తర్వాత కష్టమైనా భరించాలని అన్నాడు. దేశం కోసం ఆడటాన్ని ఎప్పుడూ గౌరవంగా భావిస్తానని అన్నాడు. గత కొన్నేళ్లుగా కోర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నాను. వైస్ కెప్టెన్‌గా కీలక నిర్ణయాల్లో భాగమయ్యాను. కోహ్లీ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌ల్లో సారథ్యం కూడా వహించానని తెలిపాడు. .

ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లను చూస్తూ పెరిగాను. ఇప్పుడు వారి సరసన నిలిచే అవకాశం దక్కడం గొప్ప విషయమేనని అన్నాడు. ఇంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా? అనే ఆశ్చర్యం వేస్తుందని అన్నాడు. మొత్తానికి ఇంటర్వ్యూల్లో రికార్డుల కోసం బుర్ర పీక్కోవద్దని మంచి సలహా ఇచ్చాడని నెట్టింట జనం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×