BigTV English
Advertisement

Rohit Sharma: కరుణ్ నాయర్ పై బుమ్రా కుట్రలు.. రోహిత్ రియాక్షన్ అదుర్స్

Rohit Sharma: కరుణ్ నాయర్ పై బుమ్రా కుట్రలు.. రోహిత్ రియాక్షన్ అదుర్స్

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ { IPL 2025} లో భాగంగా ఆదివారం రోజు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ {DC} – ముంబై ఇండియన్స్ {MI} మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ని ఓడించింది. 19 ఓవర్ లో ముంబై జట్టు వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాట్స్మెన్ లను రన్ అవుట్ చేసి మ్యాచ్ ని తన వైపుకు తిప్పుకుంది. 19 ఓవర్ లో అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మలు అవుట్ అయ్యారు.


 

దీంతో ముంబై ఇండియన్స్ ఫేట్ కేవలం 3 బంతుల్లోనే మారిపోయింది. ఈ క్రమంలో ముంబై జట్టు వరుస రెండు ఓటముల తర్వాత రెండవ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్, ముంబై స్టార్ పేసర్ బుమ్రా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. పవర్ ప్లే చివరి ఓవర్ బూమ్రా బౌలింగ్ లో కరుణ్ రెండు సిక్స్ లు, ఒక ఫోర్ తో సహా 18 పరుగులు బాదాడు. ఇదే ఓవర్ చివరి బంతికి 2 పరుగులు తీస్తూ బుమ్రా ని ఢీకొన్నాడు. మూడు సంవత్సరాల తర్వాత ఐపిఎల్ లోకి అడుగుపెట్టిన కరుణ్ నాయర్.. మెరుపు బ్యాటింగ్ తో సత్తా చాటాడు.


ఈ క్రమంలోనే బుమ్రా బౌలింగ్ లో వరుస షాట్లు ఆడి.. చివర్లో రెండు పరుగులు తీస్తుండగా జరిగిన పరిణామం ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఢిల్లీ బ్యాటింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్.. బుమ్రా వేసిన నాలుగవ ఓవర్ లో రెండు బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత ఆరవ ఓవర్ లో రెండు సిక్సులు, రెండు ఫోర్ లతో 18 పరుగులు రాబట్టాడు. దీంతో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత పరుగులు తీసే క్రమంలో చూసుకోకుండా బుమ్రా ని ఢీకొట్టాడు.

వెంటనే సారీ కూడా చెప్పాడు. కానీ తన బౌలింగ్ లో బౌండరీలు కొట్టాడనే కోపంలో బుమ్రా.. అతడిపై నోరు పారేసుకున్నాడు. కరుణ్ కూడా ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఇందులో తన తప్పేమీ లేదంటూ కరుణ్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కి వివరణ ఇచ్చాడు. కరుణ్ క్షమాపణలు చెప్పినా బుమ్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరికి అంపైర్లు కలగజేసుకొని గొడవను సర్దుమనిగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

అయితే ఓవైపు ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం విభిన్న శైలిలో స్పందించడం వీడియోలో కనిపించింది. రోహిత్ శర్మకి సంబంధించిన డిఫరెంట్ రియాక్షన్ వీడియోలో హైలైట్ అని చెప్పాలి. అన్నీ చూస్తున్న అన్నట్లు తల ఊపాడు రోహిత్. దీంతో ఈ గొడవ కంటే రోహిత్ శర్మనే హైలెట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం బుమ్రా – కరుణ్ నాయక్ కలిసి మాట్లాడుకున్నారు. ఇదంతా ఆటలో భాగమే అన్నట్లుగా ఇద్దరు కలిసిపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ {MI}.. ఢిల్లీ క్యాపిటల్స్{DC} పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Related News

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Cm Revanth Reddy: హైదరాబాద్ లో మ‌రో అంత‌ర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా త‌ర‌హాలో బౌన్సీ పిచ్ లు

BBL New Rule : BBLలో కొత్త రూల్స్‌…ఇకపై బంతి తాకితే అభిమానుల‌కే, త్వ‌ర‌లో ఐపీఎల్ లో కూడా

Jahanara Alam : సె**క్స్ కోసం పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. ఏడ్చేసిన బంగ్లా క్రికెటర్

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

Big Stories

×