Bank Accounts: సైబర్ మోసాలు రోజుకో కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త ఆలోచనలకు తెర లేపుతున్నారు. ఒకప్పుడు డెబిట్ కార్డుల నుంచి డబ్బును దోచుకునేవారు. అంతా ఆన్‌లైన్ మయం కావడంతో తమ ఆలోచనకు పదును పెట్టారు. ఆర్థిక అక్రమ లావాదేవీలు మ్యూల్ ఖాతాల ద్వారా చేయడం మొదలుపెట్టారు. వాటిని బ్యాంకులు పనిగట్టాయి. ఆయా ఖాతాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించు కున్నాయి. వాటిని స్తంభించేందుకు పూర్తి అధికారం ఇవ్వాలని కోరుతున్నాయి. అసలేం జరిగింది?
దేశంలో డిజిటలైజేషన్ శరవేగంగా సాగుతోంది. ఎక్కడ చూసినా ఫోన్ పే, జీ పేతో స్కానింగ్ చేస్తున్నారు వినియోగదారులు. ఈ తరహా వ్యవస్థలో మోసాలు జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నాయా అంటే చెప్పడం కష్టమే. జనాభా ఎక్కువగా మన దేశం సైబర్ నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారిపోయిది. ఈ విషయం మనం చెబుతున్నది కాదు. వివిధ సంస్థల రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
ఇక అసలు విషయానికొద్దాం. సైబర్ మోసాల తీరు మారింది. అక్రమ లావాదేవీల కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాలను (మ్యూల్) ఉపయోగించుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆయా ఖాతాల విషయంలో బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆగలేదు. ఎక్కువ కాలం ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉన్న అకౌంట్ ఖాతాదారులకు ఎంతో కొంత ముట్ట జెప్పి వివరాలు తీసుకుంటున్నారు.
ఆన్‌లైన్ వివరాలు, డెబిట్ కార్డు వివరాలు తీసుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములను ఖాతాలకు బదిలీ చేస్తున్నట్లు బ్యాంకులు గుర్తించాయి. ఆ తర్వాత వాటిని మెల్లగా వినియోగించుకుంటున్నారు. వీటిపై పోలీసులు ఖాతాదారులకు పట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండలేదు. మ్యూల్ ఖాతాల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.
ALSO READ: ప్లాట్ వర్సెస్ సిప్ పెట్టుబడి..ఒకదానితో భద్రత, మరొకటితో సంపద
ఆయా ఖాతాలు నిలిపి వేయానికి చట్టపరమైన అనుమతి అవసరం. అందుకే మ్యూల్ ఖాతాల స్తంభన కోసం తమకు పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి బ్యాంకులు. ఎక్కువ కాలం ట్రాన్సాక్షన్లు చేయకుండా ఉన్న అకౌంట్లను ఫ్రీజ్ చేస్తాయి సంబంధిత బ్యాంకులు. అలా చేయాలంటే కోర్టులు- చట్టం అమలు సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని చెబుతున్నాయి.
ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేసేందుకు అధికారం లేదు మాకు లేదని బ్యాంకులు చెబుతున్నమాట. సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతున్నాయి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. బ్యాంకులకు అధికారాలు ఇవ్వడం వల్ల ఆయా ఖాతాల ట్రాన్సాక్షన్లను నిరోధించవచ్చని చెబుతున్నాయి.
మ్యూల్ ఖాతా ఏంటి?
దీనివల్ల అసలైన నేరస్థులకు ముకుతాడు వేయవచ్చని అంటున్నాయి ఈ విషయంపై ఆర్‌బీఐ మరింత పరిశీలన చేయాలని ప్రతిపాదన చేసింది. మ్యూల్ ఖాతా.. బ్యాంక్ ఖాతాల ద్వారా అక్రమ నిధులను తరలించేందుకు మోసగాళ్లు వేరొకరి ఖాతాలను ఉపయోగిస్తారు. అందుకోసం ఖాతాదారులకు ఎంతో కొంత చెల్లిస్తారు. ఇతరుల ఖాతాల ద్వారా అక్రమ ట్రాన్సాక్షన్లు చేయడాన్ని మ్యూల్ ఖాతా అని అంటారు.
ప్రతి ఏడాది వేలాది మ్యూల్ ఖాతాలు పెరిగిపోతున్నాయి. అయినా మోసగాళ్లు వ్యవస్థలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అక్రమంగా నిధులు దారి మళ్లించేందకు మ్యూల్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని పరిమితం చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. మరి ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందా? లేదా అన్నది వెయిట్ చేయాలి.