BigTV English
Advertisement

Eggs vs Vegetables: గుడ్ల కంటే.. ఈ శాఖాహార ఫుడ్స్‌లోనే ప్రోటీన్ ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా!

Eggs vs Vegetables: గుడ్ల కంటే.. ఈ శాఖాహార ఫుడ్స్‌లోనే ప్రోటీన్ ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా!

ప్రోటీన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుడ్లు మాత్రమే. గుడ్లలో మాత్రమే మనకు కావలసినంత ప్రోటీన్ లభిస్తుందని అనుకుంటారు. నిజానికి శాకాహార పదార్థాల్లో కూడా గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. కానీ ఆ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే మొక్కల ఆధారిత. పాల ఆధారిత ఆహారాల గురించి ఇక్కడ ఇచ్చాము.


పనీర్
పనీర్‌ను పాలతోనే తయారు చేస్తారు. పన్నీర్ లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డు వాసన పడని వారు పనీర్ తినడం ద్వారా ప్రోటీన్ ను పొందవచ్చు. కూరల్లో పనీర్ ముక్కలను వేసుకొని వండుకున్నా లేదా ఫ్రై చేసి స్నాక్స్ లాగా తిన్నా బాగుంటుంది. పనీర్ ను సూపర్ ఫుడ్ గానే చెప్పుకుంటారు.

రాజ్మా
ఉత్తర భారత దేశంలో ఎక్కువగా తినే పప్పులో రాజ్మా ఒకటి. రాజ్మా చావల్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. దీనిలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్, ఐరన్, పోలేట్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.


బాదం
రోజుకు గుప్పెడు బాదం పప్పులు తినండి చాలు. మీ శరీరానికి కావలసినంత ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్ కూడా ఉంటాయి. అలాగే విటమిన్లు, మెగ్నీషియం వంటివి కూడా బాదం ద్వారా అందుతాయి. గుడ్డు తినని వారు బాదం తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

సాదా పెరుగు
కప్పు పెరుగు తినడం ద్వారా కూడా మీరు ప్రోటీన్ ను పొందవచ్చు. దీనిలో ప్రోబయోటిక్స్, క్యాల్షియం కూడా నిండుగా ఉంటాయి. అధిక ప్రోటీన్ కంటెంట్ శరీర పోషణకు సహాయపడుతుంది. ఆరు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రోటీన్ కోసం పెరుగును తినిపించవచ్చు.

క్వినోవా
గ్లూటెన్ రహిత ధాన్యం క్వినోవా. ఇది సూపర్ ఫుడ్ గా పేరుపొందింది. దీనిలో ముఖ్యమైన అమినో ఆమ్లాలు కూడా ఎన్నో ఉంటాయి. బియ్యం ప్రత్యామ్నాయంగా క్వినోవాను వాడతారు. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ ను అధికంగా కలిగి ఉంటుంది.

పెసర పప్పు దినుసులు
పెసరపప్పు బద్దలు కాకుండా పైన పొట్టుతో ఉన్న పెసరపప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని మూంగ్ దాల్ అంటారు. వీటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కిచిడీ, దోశలు, సూప్ వంటివి చేసుకోవచ్చు.

కొమ్ము శెనగలు
కొమ్ము శెనగలతో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి. కొమ్ము శెనగలు కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. చోలే వంటి కూరలు కొమ్ము శనగలతో చేస్తారు. చోలే బటూరేకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు.

మసూర్ దాల్
ఎర్ర కందిపప్పును మసూరదాల్ ను పిలుస్తారు. ఇది త్వరగా ఉడికే పప్పు. అలాగే దీనిలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. మసూర్ దాల్ తో సూప్‌లు, పప్పులు, కూరలు వండుకోవచ్చు. దీంట్లో పోషకాలు నిండుగా ఉంటాయి.

Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?

టోఫు
టోపు అనేది సోయాతో చేసే పనీర్ ఇది. అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దీన్ని కూడా పనీర్ లాగే వండుకోవచ్చు. దీంతో బిర్యాని చేసుకోవచ్చు. లేదా కూరలో వండుకోవచ్చు. ఏదో రకంగా టోపును తినడం ద్వారా సరైన కావాల్సిన పోషకాలను పొందవచ్చు.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×