Rohit Sharma Ritika: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. సోమవారం రోజు ముంబై ఇండియన్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. గత మ్యాచ్ కి గాయం కారణంగా దూరంగా ఉన్నాడు రోహిత్ శర్మ. శుక్రవారం రోజు లక్నోతో జరిగిన మ్యాచ్ లో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడలేదు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడి మోకాలికి బంతి తగలడంతో అందుబాటులో లేకుండా పోయాడని జట్టు వర్గాలు తెలిపాయి. ఈ సీజన్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడగా.. ఇందులో వరుసగా 0, 8, 13, 17 పరుగులు మాత్రమే చేశాడు. సోమవారం రోజు ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కానీ రోహిత్ కేవలం 17 పరుగులకే పెవిలియన్ చేరాడు.
రెండు ఫోర్లు, ఒక సిక్స్ తో ప్రారంభంలో మంచి టచ్ లో ఉన్నట్లే కనిపించిన రోహిత్ శర్మ.. చివరికి యష్ దయాల్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై పరాజయం తర్వాత సోషల్ మీడియాలో రోహిత్ శర్మ పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. రోహిత్ ఆటతీరు, తరచూ ఫెయిల్ అవుతున్న ఫామ్ పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబై అభిమానులు రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశపడుతున్నారు.
కానీ ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమవుతుందా..? అన్నదానిపై సందేహాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఓటమి చెందిన అనంతరం రోహిత్ శర్మ చేసిన ఓ పనితో మరింత విమర్శలపాలవుతున్నాడు. ఆర్సిబితో ఓటమి అనంతరం రోహిత్ శర్మ.. తన భార్య రితికతో కలిసి కారులో షికార్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో “బ్యాటింగ్ చేయడం చేతకాదు కానీ.. భార్యతో షికార్లు చేస్తున్నావా” అంటూ మండిపడుతున్నారు నెట్టిజెన్లు.
ఓవైపు బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతున్న క్రమంలో.. భర్యతో షికార్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే సోమవారం రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఓ అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో మొదటి ఓవర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా నిలిచాడు.
చేజింగ్ లో రోహిత్ శర్మ మొదటి ఓవర్ లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో డీప్ స్క్వేర్ లెగ్ వైపు భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఇప్పటివరకు లీగ్ మొత్తంలో మొదటి ఓవర్లో 13 సిక్సర్లు కొట్టాడు. ఇది ఓ రికార్డు. క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్ 12 సిక్సర్లతో తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 13వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో నైనా రోహిత్ శర్మ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ని చూడాలని కోరుకుంటున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">