Nicholas Pooran : వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) క్రికెట్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం సీపీఎల్ 2025లో భాగంగా అతను ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వర్సెస్ ఆంటిగ్వా బార్బుడా ఫాల్కన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో TKR కెప్టెన్ నికోలస్ పూరన్ స్టంప్ ఔట్ అయ్యాడు. అయితే పూరన్ వికెట్ ను రహకీమ్ కార్న్ వాల్ పడగొట్టాడు. జ్యువెల్ ఆండ్రూ ఎలక్ట్రిక్ స్టంప్ ఔట్ చేయడం ద్వారా ఔట్ అయ్యాడు పూరన్. ఆంటిగ్వా బార్బుడా ఫాల్కన్స్ వర్సెస్ ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 10వ ఓవర్ తొలి డెలివరీలో రహకీమ్ కార్న్ వాల్ స్టంప్ కి వైడ్ గా ఫుల్ లిష్ బాల్ ను బౌలింగ్ చేశాడు. దానిని నికోలస్ పూరన్ ముందుకు వచ్చి బలంగా కొట్టాలని చూశాడు. కానీ మిస్ అయ్యాడు. వెంటనే వికెట్ కీపర్ జ్యువెల్ ఆండ్రూ బంతిని పట్టుకొని ఎలక్ట్రిక్ పేస్ లో స్టంప్స్ ను కొట్టాడు.
Also Read : Watch Video : ఒక్క బంతికి 6 పరుగులు.. నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ చేసిన పనికి పిచ్చెక్కి పోవాల్సిందే
పూరన్ స్టంప్ ఔట్..
నికోలస్ పూరన్ తిరిగే లోపు స్టంప్ ఔట్ అయ్యాడు. 14 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా &బార్బుడా ఫాల్కన్స్ (ABF) నిర్ణీత 20 ఓవర్లలో 167/6 పరుగులు చేసింది. జువెల్ ఆండ్రూ 22, కార్న్ వాల్ 09, కరిమా గోరె, 10, జాకోబ్స్ 08, షకీబ్ 07, వాషిం 39, ఫెబియన్ అలెన్ 45, శామర్ స్ప్రింగర్ 10 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 167 పరుగులు చేశారు. హోసిన్ 1, అమిర్ 1, నాతన్ ఎడ్వర్డ్ 2, ఉస్మాన్ తరిఖ్ 2 వికెట్ల చొప్పున తీశారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది TKR జట్టు. ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ఛేజింగ్ చేయడంలో కాస్త తడబడిందనే చెప్పాలి.
Also Read : Brock Lesnar’s daughter: అర్థ న**గ్నంగా WWE స్టార్ కూతురు.. ఫోటోలు వైరల్
ఆంటిగ్వా &బార్బుడా ఫాల్కన్స్ విజయం
ట్రిన్ బాగో నైట్ రైడర్స్ ఓపెనర్ కొలిన్ మున్రో 18 బంతుల్లో 44 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. కానీ అలెక్స్ హేల్స్ మాత్రం 10 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ 14 బంతుల్లో 10 పరుగులు చేసి స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. కిసీ కార్టీ 35 పరుగులు చేయగా.. డారెన్ బ్రావో 2 పరుగులు మాత్రమే చేశాడు. కీరన్ పోలార్డ్ 28 బంతుల్లో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హోసియన్ 2, నాథన్ ఎడ్వర్డ్స్ 10 పరుగులు చేసారు. నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు. దీంతో ఆంటిగ్వా &బార్బుడా ఫాల్కన్స్ జట్టు 08 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇదిలా ఉంటే.. నికోలస్ పూరన్ రన్ ఔట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకోవడం విశేషం.
Pooran bamboozled! 💫
Rahkeem Cornwall gets the TKR Skipper! 💥#CPL25 #CricketPlayedLouder#BiggestPartyInSport #ABFvTKR #Sky365 pic.twitter.com/kBmHmwgIFZ
— CPL T20 (@CPL) August 21, 2025