BigTV English

Rohit Sharma : మాకు ఇంకో అవకాశం ఉంది: రోహిత్ శర్మ

Rohit Sharma : మాకు ఇంకో అవకాశం ఉంది: రోహిత్ శర్మ
Rohit Sharma

Rohit Sharma : కంగారుపడకండి.. రోహిత్ శర్మ అన్నది 2027లో వచ్చే వన్డే వరల్డ్ కప్ గురించి కాదు.. త్వరలో రాబోయే టీ 20 వరల్డ్ కప్ గురించి.. ఇంతకీ తనేమన్నాడంటే.. వన్డే ప్రపంచకప్ లో గెలవాలని అందరికీ ఉంటుంది. నేను చిన్నతనం నుంచి వన్డేలు చూసి పెరిగాను.


2023 వన్డే వరల్డ్ కప్  మనదేశంలో జరగడం అడ్వాంటేజ్ అని చెప్పాలి. అయితే చివరి వరకు గెలిచి, ఆడాల్సిన ఒక్క ఫైనల్ మ్యాచ్ లో  ఓడిపోయాం. ఇది మేమే కాదు, అభిమానులకు చాలా బాధ కలిగించిందని అన్నాడు. అందుకే ఐసీసీ నిర్వహించే టీ 20 వరల్డ్ కప్ గెలిచి, ఆ లోటు భర్తీ చేయాలని చూస్తున్నామని తెలిపాడు.

నిజానికి భారత క్రికెట్ అభిమానులకు బాకీ ఉన్నామని తెలిపాడు. అందుకే ఓడిన వన్డే వరల్డ్ కప్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇప్పుడు జరగాల్సింది చూడాలని అన్నాడు. కానీ నా దృష్టిలో వన్డే వరల్డ్ కప్ అనేది అతి పెద్ద టోర్నీ. అలాగని టీ 20 వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ లను చిన్నగా చూడటం లేదని అన్నాడు. అది తన ఉద్దేశం కాదని చెప్పాడు.


టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్సీపై ఇంకా బీసీసీఐ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ రోహిత్ శర్మ మాత్రం తనే కెప్టెన్ అన్నట్టు జట్టులో సభ్యుల గురించి, వారికి వచ్చే అవకాశాల గురించి, ఓపెన్ గా మాట్లాడటం కొందరిని విస్మయపరుస్తోంది. అయితే తనకి ముందుగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చెప్పిందా? అని కూడా అంటున్నారు. అందువల్లనే తను మీడియా ముందు ధైర్యంగా మాట్లాడుతున్నాడని అంటున్నారు.

టీ 20లో ఆడే ఆటగాళ్లు నిర్ణయమైపోయారని రోహిత్ శర్మ చెప్పడం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. అయితే రోహిత్ శర్మ వారి పేర్లయితే చెప్పలేదు. కానీ ఆయన చెప్పిన మాటలను బట్టి, అంతా తెలిసిన వారితోనే జట్టు నిండిపోయేలా ఉంది.

ఒకరకంగా చెప్పాలంటే వన్డే వరల్డ్ కప్ 2023 ఆడిన జట్టే దాదాపు ఉంటుందని అందరూ అంటున్నారు. ఇప్పుడు టీ 20 ఆడే కుర్రాళ్లలో ఒకరిద్దరికి మాత్రమే చోటు ఉండవచ్చునని అంటున్నారు. వారిలో రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబె, ముఖేష్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×