Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి తెలియని వారు ఉండరు. క్రికెట్ లో తన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మూట కట్టుకున్నాడు రోహిత్ శర్మ. 2024 టి-20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో భారత జట్టు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. కెప్టెన్ గా ఇది రోహిత్ శర్మ కి రెండవ ఐసీసీ టైటిల్.
Also Read: IPL 2026: ఐపీఎల్ లో సంచలనం… ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్‌కు స్టబ్స్?
ఆ తర్వాత ఐపీఎల్ 2025 జరుగుతున్న సమయంలోనే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కి కూడా గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక రోహిత్ శర్మ సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఎక్కడికైనా ఓ సాధారణ వ్యక్తిలా వ్యక్తిలా వెళుతుంటాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది.
సాధారణంగా క్రికెటర్లు అంటేనే కొత్త కార్లను కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అలాగే ఉత్సాహంగా లాంగ్ ట్రిప్ వేసుకొని మైండ్ ని రిఫ్రెష్ చేసుకొని.. మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుంటారు. ఇలా రోహిత్ శర్మ కూడా గత ఏడాది 2024లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సందర్భంగా ఓ ఉబర్ టాక్సీలో ప్రయాణించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2024లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ సమయంలో తన మైండ్ ని రిఫ్రెష్ చేసుకునేందుకు రోహిత్ శర్మ తన సహచరులతో కలిసి ఓ ఉబర్ క్యాబ్ ని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆస్ట్రేలియా వీధుల్లో తిరిగాడు. దీంతో ఉబర్ క్యాబ్ లో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న రోహిత్ శర్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరు షాపింగ్ చేసేందుకు ఆ ఉబర్ క్యాబ్ లో వెళ్లినట్లు సమాచారం. ఆ ఉబర్ క్యాబ్ లోని డాష్ క్యామ్ లో ఈ వీడియో రికార్డు చేయబడింది.
రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ 2027 లో ఆడతాడా..? అనేది ప్రస్తుతం అందరిలో నెలకొన్న ప్రశ్న. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఇప్పటికే టెస్ట్, టి-20 లకు రిటైర్మెంట్ పలికిన రోహిత్ శర్మ.. సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడడు. రాబోయే వన్డే ప్రపంచ కప్ 2027 వరకు తన కెరీర్ ని కొనసాగించాలనేది కేవలం అతడి అభిప్రాయం. అభిమానుల ఆకాంక్ష కూడా ఇదే. కానీ మేనేజ్మెంట్ రోహిత్ కి అవకాశాలు ఇస్తుందా..? అనేది సందిగ్ధత. కానీ రోహిత్ శర్మ ఎప్పుడైనా అత్యుత్తమ ప్రదర్శనలు అందించేందుకు ఏమాత్రం వెనకాడడు.
Rohit Sharma was seen going with his teammates in an Uber taxi in Australia last year.😂❤️ pic.twitter.com/0vJngJjK4O
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 2, 2025