BigTV English

Rohit Sharma on MS Dhoni: ధోనీ, నేనూ ఒకటే.. అంటున్న రోహిత్!

Rohit Sharma on MS Dhoni: ధోనీ, నేనూ ఒకటే.. అంటున్న రోహిత్!

Rohit Sharma on MS Dhoni


Rohit Sharmas Reaction On MS Dhoni Leaving CSK Captaincy: 74 రోజుల పాటు కొనసాగే మెగా ఈవెంట్ ఐపీఎల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య టాస్ పడనుంది. ఈ కప్ కోసం మొత్తం పదిజట్లు తలపడనున్నాయి.

మొత్తానికి సీఎస్కే నుంచి ఎమ్మెస్ ధోనీ తప్పుకోవడంపై రకరకాలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ట్రోలింగులు, మీమ్స్ కూడా బయలుదేరాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ధోనీతో కలిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేసి, దానికి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీని యాడ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.


నిజానికి రోహిత్ శర్మ గుండెల్లో భారం కొద్దిగా దిగినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ముంబై ఇండియన్స్ తనని తప్పించారనే బాధని మోస్తూ వచ్చాడు. కానీ టైమ్ వచ్చినప్పుడు ఎంతటివారైనా తప్పుకోవాల్సిందేనని ధోనీ చెప్పకనే చెప్పాడని అంటున్నారు. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్లాల్సిందేననే సామెత, ప్రతి మనిషి జీవితంలో అక్షర సత్యమని అంటున్నారు.

Also Read: కొత్త టెక్నాలజీ.. స్మార్ట్ రీప్లే సిస్టమ్ వచ్చింది..

ధోనీ తనంతట తాను తప్పుకున్నాడు. కానీ రోహిత్ శర్మ విషయంలో  అలా జరగలేదు. వాళ్లు కూడా 5సార్లు ముంబై ఇండియన్స్ కి ట్రోఫీ తీసుకొచ్చిన కెప్టెన్ గా గౌరవంగా చెప్పాల్సిందని అంటున్నారు. అంతర్గతంగా చెప్పి ఉండాల్సిందని చెబుతున్నారు. తను మాట విని ఉండకపోతే అలా చేయాల్సింది. అంతేకానీ తన పరువు పోయేలా ప్రవర్తించడం సరైన విధానం కాదని అంటున్నారు.

ఇప్పుడు రివర్స్ స్వింగ్ అయి ముంబై పరువు పోయింది. రేపు ఎవరన్నా మంచి ఆటగాళ్లు ఆడాలంటే ఆలోచించే స్థితికి వచ్చేసిందని అంటున్నారు. కానీ రోహిత్ శర్మ గౌరవం రెట్టింపైంది. టీమ్ ఇండియా టీ 20 ప్రపంచ కప్ కి తనే కెప్టెన్ గా ఉన్నాడు. ఇది ముంబయికెంత గౌరవంగా ఉండేదని అంటున్నారు.

Also Read: Virat Kohli: విరాట్ కొహ్లీ పొమ్మన్నాడా? అలా అన్నాడా? నెట్టింట బిగ్ డిబేట్

మొత్తానికి రోహిత్ శర్మ ఫొటో…నెట్టింట వైరల్ గా మారింది. తర్వాత విరాట్ కొహ్లీ కూడా ఒక కామెంట్ చేశాడు. స్నేహితుడు, గురువు  లెజండరీ మహేంద్ర సింగ్ ధోనీ ఏ పాత్రలో ఉన్నా తన మార్క్ చూపిస్తూనే ఉంటాడు. తన ఆటని, కెప్టెన్సీని అభిమానులెవరూ మరిచిపోలేరని అన్నాడు. అంతేకాదు క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీ ప్రత్యేకంగా ఉంటుందని భావోద్వేగంతో తెలిపాడు.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×