BigTV English

Virat Kohli : విరాట్ కొహ్లీ పొమ్మన్నాడా? అలా అన్నాడా? నెట్టింట బిగ్ డిబేట్

Virat Kohli : విరాట్ కొహ్లీ పొమ్మన్నాడా? అలా అన్నాడా? నెట్టింట బిగ్ డిబేట్

during CSK vs RCB IPL 2024 opener


Virat Kohli Gives A Mouthful To Rachin Ravindra After CSK Star’s Dismissal Goes Viral: చెన్నయ్ సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి చాలా సీరియస్ గా కనిపించాడు. ఒక దశలో రచిన్ రవీంద్రను దుర్భాషలు ఆడాడు అంటూ.. ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టులో న్యూజిలాండ్ ప్లేయర్, భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర ఉన్నాడు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 173 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కే ఓపెనర్ రచిన్ రవీంద్ర దుమ్ము దులుపుతున్నాడు. కేవలం 15 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.


Also Read: క్రికెట్ లో ధోనీ ఎప్పటికి.. కుర్రాడే!

తనని ఆపకపోతే చాలా ప్రమాదమని ఆటగాళ్లందరూ ఆలోచిస్తున్నారు. కొహ్లీ కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ సమయంలో ఆర్సీబీ బౌలర్ కర్ణ్ శర్మని టార్గెట్ చేసుకుని రచిన్ రవీంద్ర చితక్కొట్టేశాడు. అనుకోకుండా తన బౌలింగ్ లోనే అవుట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో విరాట్ కొహ్లీ తన అసహనాన్ని ప్రదర్శించాడు. అంతేకానీ ఆర్సీబీ నుంచి మ్యాచ్ ని దూరం చేసిన రచిన్ రవీంద్రను మాత్రం దుర్భాషలు ఆడలేదని అంటున్నారు.

తన మూమెంట్స్ ని బట్టి అర్థమైంది ఏమిటంటే.. బాబూ.. రచిన్,  ఇంక ఆడింది చాలు, పెవిలియన్ కి వెళ్ళి కూర్చోమని చేతులతో చెబుతున్నట్టు ఉందని కొందరు అంటున్నారు. కొందరేమో కాదు, న్యూజిలాండ్ నుంచి వచ్చావ్, అక్కడికే పో అన్నట్టు అన్నాడని అంటున్నారు. అయితే కొహ్లీ అంత దారుణంగా మాట్లాడే వ్యక్తి కాదని, జెంటిల్మేన్ అని కొందరంటున్నారు. పెవిలియన్ కే వెళ్లమని మాత్రమే దారి చూపించాడని కొందరు చెబుతున్నారు.

ఈ ఘటన తర్వాత గ్రౌండ్ లో ఏం మాట్లాడినా, ఇలా చిలవలు, పలవలు చేసేస్తే, ఇక అందరూ నోర్మూసుకుని ఉండేలా ఉన్నారని అంటున్నారు. వాళ్లేం చేసినా, ఏం మాట్లాడినా వాటికి ద్వందార్థాలు తీస్తుంటే, ఆట ఇంకేం ఆడతారని కొందరు అంటున్నారు. మొత్తానికి తొలిరోజు కొహ్లీ అలా వార్తల్లోకి ఎక్కాడు.

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×