Train Accident: ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతుండగా.. ముంబ్రా-దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన సమయంలో, పుష్పక్ ఎక్స్ ప్రెస్-కసారా లోకల్ ఒకదానికొకటి దాటుతున్నాయి.
ముంబైలో విపరీతమైన రద్దీ కారణంగా.. లోకల్ ట్రైన్ ప్రయాణికులు ఫుట్ హబోర్డింగ్‌లో ప్రయాణించడం సర్వసాధారణం. అయితే ఈరోజు సోమవారం కావడంతో మరింత రద్దీ ఏర్పడింది. ప్యాసింజర్లు డోర్లకు వేలాడుతూ ప్రయాణించారు. ట్రైన్ ప్రారంభమైన కొద్ది సేపటికి.. కదులుతున్న రైలు నుంచి ప్రయాణికులు అదుపుతప్పి జారి కిందపడ్డారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయు. మృతుల్లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం.. సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా ఇలాంటి ఘటనలు తరుచూ.. ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో.. 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు.
Also Read: కేదార్నాథ్, సోమనాథ్, కోణార్క్ హంపి.. ఆ ఆలయాలు విశిష్టత ఏంటి? బడ్జెట్ ప్లాన్ ఎంతంటే?
ఇలాంటి ఘటనలు తరచుగా జరగడం, లోకల్ రైళ్లలో భద్రతా చర్యలు తక్కువగా ఉండడం.. ప్రజలలో ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం.. తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Thane: 10-12 passengers reportedly fell off a fast local train from Mumbra to CSMT due to overcrowding. Many were hanging near the doors. pic.twitter.com/GUpIIRoHMg
— priyanka lathi (@priyankalathi1) June 9, 2025