BigTV English

RR Vs KKR Match Preview: నువ్వా..? నేనా..? నేడు రాజస్థాన్ తో కోల్ కతా డీ!

RR Vs KKR Match Preview: నువ్వా..? నేనా..? నేడు రాజస్థాన్ తో కోల్ కతా డీ!

IPL 2024 70th Match – Rajasthan Vs Kolkata Preview: ఐపీఎల్ సీజన్ 2024 ప్రారంభంలో ఎవరూ ఊహించని రీతిలో రాజస్థాన్ అన్ని జట్ల మీద వరుసగా గెలుస్తూ చాలాకాలం నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. తర్వాతర్వాత మరెందుకో మరి, ఒక్కసారి గాడి తప్పింది. వరుసగా 4 మ్యాచ్ లు ఓడిపోయి, దిక్కుతెలియకుండా అయిపోయింది. మరోవైపు నెంబర్ వన్ స్థానానికి వెళ్లిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఆడుతూ కోల్ కతా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేడు నెంబర్ వన్, నెంబర్ టూ మధ్య గౌహతీలో మ్యాచ్ జరగనుంది.


కోల్ కతా ఇంతవరకు 13 మ్యాచ్ లు ఆడి 19 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంది. అలాగే రాజస్థాన్ కూడా 13 మ్యాచ్ లు ఆడి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 29 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో కోల్ కతా 14, రాజస్థాన్ 14 సమానంగా గెలిచాయి. సమఉజ్జీలుగా నిలిచాయి. మరో మ్యాచ్ లో ఫలితం రాలేదు. అందుకే నేడు రెండు జట్ల మధ్య మ్యాచ్ నువ్వా? నేనా? అన్నట్టే సాగనుందని చెప్పాలి.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా చాలా కూల్ గా ముందడుగు వేస్తోంది. అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా తమ పాత్రలను సమర్థవంతంగా పోషిస్తున్నారు. అందువల్లే బ్యాట్ తో ఫెయిలైతే, బౌలింగులో మ్యాచ్ నిలబెడుతున్నారు. బౌలింగు విఫలమైతే, బ్యాట్ తో గెలిపిస్తున్నారు. అలా ఇంతవరకు బాగానే నెట్టుకొచ్చారని చెప్పాలి.


Also Read: హైదరాబాద్ ముందడుగు వేస్తుందా ? నేడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్

రాజస్థాన్ ఎందుకో గాడి తప్పింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో అద్భుతంగా ఆడిన జట్టు సడన్ గా వెనుకడుగు వేసింది. ఓపెనర్ యశస్వి ఫెయిల్ అవుతున్నాడు. రియాన్ పరాగ్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, హెట్ మెయిర్ అందరూ బ్రహ్మాండంగా ఆడి, ఒకేసారి చేతులెత్తేస్తున్నారు. ఆడితే అందరూ ఆడటం, లేదంటే అందరూ అవుట్ అవడం సరికాదని నిపుణులు అంటున్నారు.

బౌలింగులో కూడా చాహల్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, అశ్విన్ అందరూ ఇంతవరకు మ్యాచ్ లను గెలిపించి, ఇప్పుడు ఉదారంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. ప్లే ఆఫ్ కి వెళ్లే ముందు జరిగే మ్యాచ్ లోనైనా గెలిచి రాజస్థాన్ టచ్ లోకి వస్తుందా? లేదా? అనేది చూడాల్సిందే.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×