BigTV English

Russell’s emotion : నా దేశం కూడా నాపై అంత ఇన్వెస్ట్ చేయలేదు

Russell’s emotion : నా దేశం కూడా నాపై అంత ఇన్వెస్ట్ చేయలేదు
Russell's emotion

Russell’s emotion : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రూ రెసెల్ బాగా ఎమోషన్ అయ్యాడు. తనకు సర్జరీ జరిగినప్పుడు.. తన దేశం నుంచి కూడా రానంత మద్దతు కోల్‌కతా మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఇది వరకు వేరే ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ.. వాళ్లు కూడా తనకు అండగా నిలబడలేదని గుర్తు చేశాడు. తనను ఎంతగానో నమ్మిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు.


ఆండ్రూ రసెల్ 2014 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో రసెల్‌కు 175 స్ట్రైక్ రేట్ ఉంది. అయితే, ఈ జమైకన్ ఆల్ రౌండర్‌ కొన్ని సీజన్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. మోకీలు సర్జరీకి కావాల్సిన ట్రీట్ మెంట్ ఖర్చులు కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజ్ మెంట్ పెట్టుకుందని గుర్తు చేశాడు. 2019 జున్‌లో ఆండ్రూ రసెల్‌కు మోకీలు సర్జరీ జరిగింది. ఈ విషయంలో తన దేశం కూడా సహాయం చేయలేదన్నాడు.

సర్జీ తరువాత ఆండ్రూ రసెల్ పర్ఫామెన్స్ అంత గొప్పగా ఏం లేదు. ఈ సీజన్‌లో రసెల్ పెద్దగా రాణించలేదు కూడా. 9 మ్యాచ్‌లు ఆడిన రెసెల్ కేవలం 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బ్యాటింగ్ పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. 9 మ్యాచ్‌లకు కలిపి 142 పరుగులు చేశాడు. అయినా సరే, తనపై నమ్మకంతో ఆడిస్తున్న జట్టుపై ప్రశంసలు కురిపించాడు.


నిజంగానే ఆండ్రూ రసెల్‌ను వదులుకోడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధంగా లేదు. 9 ఏళ్లుగా రసెల్‌ను కొనుగోలు చేస్తూనే ఉంది. రసెల్ పర్ఫామెన్స్‌పై తమకు నమ్మకం ఉందంటోంది మేనేజ్ మెంట్. కీలక సమయంలో వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నమ్ముతోంది. ముఖ్యంగా రసెల్‌ను సిక్స్త్ పొజిషన్లో పంపిస్తోంది. ఆ టైంలో జట్టుకు ఓ మంచి హిట్టర్ కావాల్సి ఉందని, ఆ పొజిషన్‌ను ఒక్క ఆండ్రూ రసెల్ మాత్రమే భర్తీ చేయగలడని నమ్ముతోంది కోల్‌కతా నైట్ రైడర్స్. 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×