BigTV English

Jr.NTR :ఎన్టీఆర్ శతజయంతికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించలేదా? ఏంటీ రీజన్?

Jr.NTR :ఎన్టీఆర్ శతజయంతికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించలేదా? ఏంటీ రీజన్?
Jr.NTR

Jr.NTR : ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది టీడీపీ. వంద సభలు ఏర్పాటు చేసి ఘన నివాళి అర్పిస్తోంది. అయతే, మొన్న శుక్రవారం విజయవాడలో జరిగిన వేడుక మాత్రం నందమూరి బాలకృష్ణ జరిపించిందే. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా వచ్చింది నారా చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీ కాంత్. ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసి ఘనంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆహ్వానించింది. విజయవాడకు వచ్చిన రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వేడుకలకు రజనీకాంత్ ను పిలవడం ద్వారా శతజయంతి వేడుకలను మరో రేంజ్‌కి తీసుకెళ్లారు.


రజనీకాంత్ రావడం, శతజయంతి వేడుకలకు వెళ్లే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోవడం పెద్ద చర్చనీయాంశం అయింది. పైగా వేదిక నుంచే చంద్రబాబు పరిపాలనను మెచ్చుకున్నాడు. రాజకీయాలు వద్దంటూనే రాజకీయాలు మాట్లాడారు. ముఖ్యంగా చంద్రబాబు విజన్‌ను మెచ్చుకుంటూ… ఇప్పటి హైదరాబాద్ మరో న్యూయార్క్‌లా కనిపించడానికి కారణం చంద్రబాబేనంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. దీనిపై పొలిటికల్ కౌంటర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా శతజయంతి వేడుకలకు రజనీకాంత్ రావడమే మొత్తం ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచింది.

అయితే, ఈ వేడుకలను దగ్గరుండి చూసుకున్నది, నడిపించినది నందమూరి బాలకృష్ణే. మొత్తం అరేంజ్‌మెంట్స్ బాలకృష్ణ, అతని టీమ్ చూసుకుంది. గెస్టులన పిలవడం, వారికి ఆహ్వానం పలకడం, ఎన్టీఆర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులను శతజయంతి వేడుకలకు రప్పించడం అంతా నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగానే జరిగింది. పైగా ఏప్రిల్ 28న అన్నగారి శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నామంటూ తన ఫ్యాన్స్‌కు వీడియో సందేశం కూడా పంపారు.


అయితే, ఈ వేడుకలకు ఎన్టీఆర్‌ను ఎందుకు పిలవలేదు అనే చర్చ జరుగుతోంది. నిజంగానే పిలవలేదా, పిలిచినా రాలేదా అనే విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వచ్చినా… ఎన్టీఆర్ రాకపోవడంపై పెద్ద డిస్కషనే జరుగుతోంది. మొన్న నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు.. 11వ రోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లేచి నిలబడినప్పటికీ.. బాలకృష్ణ వారిని పట్టించుకోకూండానే వెళ్లిపోయిన వీడియో వైరల్ అయింది. దీంతో కావాలనే ఎన్టీఆర్‌ను పిలవలేదా అనే చర్చ జరుగుతోంది.

పైగా ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎవరినీ పిలవనక్కర్లేదని, ఫ్యాన్స్ అందరూ రావొచ్చంటూ బాలకృష్ణ వీడియో మెసేజ్ పంపించారని కూడా చెబుతున్నారు. ఈ కార్యక్రమం జనార్థన్ రెడ్డి ఛైర్మన్‌షిప్‌లో జరిగింది కాబట్ట.. బాలకృష్ణ కూడా బాధ్యుడు కాదంటున్నారు. ఏమో.. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తే తప్ప అసలు విషయం ఏంటో బయటకు రాదు. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×