BigTV English

Ruthuraj Gaikwad: ఓకే ఓవర్ లో 7 సిక్సులు.. రుతురాజ్ సంచలన ఇన్నింగ్స్..

Ruthuraj Gaikwad: ఓకే ఓవర్ లో 7 సిక్సులు.. రుతురాజ్ సంచలన ఇన్నింగ్స్..

Ruthuraj Gaikwad : విజయ్ హజారే ట్రోఫిలో మహారాష్ట్ర కెప్టెన్ , ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. యూపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పెను విధ్వంసం సృష్టించాడు. డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరో అరుదైన రికార్డు సాధించాడు.


ఒకే ఓవర్ లో 7 సిక్సులు
రుతురాజ్ ఒకే ఓవర్ లో 7 సిక్సులు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ లో ఈ ఫీట్ సాధించాడు. శివ సింగ్ ఆ ఓవర్ లో 5 బంతిని నోబాల్ వేశాడు. దీంతో ఆ ఓవర్ లో 7 బాల్స్ వేయాల్సి వచ్చింది. మొత్తం 7 బంతులను సిక్సులుగా మలిచి రుతురాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో ఆ ఓవర్ లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. ఆ బౌలర్ శివ సింగ్ ఈ మ్యాచ్ లో 9 ఓవర్ల వేసి 88 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అందులో 66శాతం పరుగులు రుతురాజ్ సాధించినవే కావడం విశేషం. ఎక్సట్రాలు కలిపి మిగతా బ్యాటర్లు చేసినవి 110 పరుగులు మాత్రమే.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గారీ సోబర్స్ , రవిశాస్త్రి ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో యువరాజ్ సింగ్, హెర్షల్ గిబ్స్ ఈ ఘనత సాధించారు.


డబుల్ సెంచరీతో విధ్వంసం
ఓపెనర్ గా దిగిన రుతురాజ్ 159 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 16 సిక్సులతో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది లిస్ట్ ఏ క్రికెట్ 39వ డబుల్ సెంచరీ. భారత్ తరఫున ఐదో వ్యక్తిగత టాప్ స్కోర్. ఇటీవల తమిళనాడు బ్యాటర్ జగదీశన్ అరుణాచల్ ప్రదేశ్ పై 277 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వారంలోపే రుతురాజ్ డబుల్ సెంచరీతో విధ్వంసం చేశాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×