BigTV English

SA vs ENG Match Highlights : ఉత్కంఠ పోరులో.. సౌతాఫ్రికా గెలుపు

SA vs ENG Match Highlights : ఉత్కంఠ పోరులో.. సౌతాఫ్రికా గెలుపు
  • టీ 20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్
  • సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్

SA vs ENG 45th Match Highlights : ఆఖరి వరకు టెన్షన్ గా సాగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవాలంటే.. చివరి 12 బంతుల్లో 21 పరుగులు చేయాలి. రబడ బౌలింగుకి వచ్చాడు. ఇంగ్లండ్ బ్యాటర్ లివింగ్టన్ అవుట్ అయిపోయాడు. మొత్తానికి ఆ ఓవర్ లో 7 పరుగులు వచ్చాయి.


ఇక ఆఖరి ఓవర్.. 6 బంతులు.. 14 పరుగులు, జోఫ్రా ఆర్చర్ బౌలింగు.. అంతవరకు అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ (53) తను అవుట్ అయిపోయాడు. అప్పుడు శామ్ కర్రాన్ వచ్చి ఒక ఫోర్ కొట్టాడు. కానీ పని కాలేదు. చివరికి 1 బాల్ 8 పరుగులు గా సమీకరణాలు మారిపోయాయి. ఆఖరి బాల్ సింగిల్ రన్ వచ్చింది. అలా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సౌతాఫ్రికా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ 20 ప్రపంచకప్.. సూపర్ 8లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. సెయింట్ లూసియాలో జరిగిన హోరాహోరీ పోరులో ఇంగ్లండ్ ను ఓడించిన సౌతాఫ్రికా దాదాపు సెమీఫైనల్ కి చేరువైంది.


ఒక దశలో ఇంగ్లండ్ వైపు మొగ్గు చూపిన మ్యాచ్ చివరి రెండు ఓవర్లలో మళ్లీ సౌతాఫ్రికావైపు తల వాల్చింది. దాంతో బౌలర్లు ఆ పట్టు సడలనివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగు చేసి, కీలకమైన 2 వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించారు.

వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో అదే 6 వికెట్ల నష్టానికి 156 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో సౌతాఫ్రికా 7 పరుగుల తేడాతో విజయం సాధించి, సెమీస్ ముంగిట నిలిచింది.

అయితే 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరు ఫిల్ సాల్ట్ (11), కెప్టెన్ జోస్ బట్లర్ (17) త్వరగా అవుట్ అయిపోయారు. అయితే తర్వాత వచ్చిన జానీ బెయిర్ స్టో (16), మొయిన్ ఆలి (9) కూడా నిరాశపరిచారు. ఒక దశలో ఇంగ్లండ్ 10.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 61 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఇక సౌతాఫ్రికా గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. అప్పుడొచ్చాడు హ్యారీ బ్రూక్.. ఒక రేంజ్ లో సౌతాఫ్రికా బౌలర్లను ఆడుకున్నాడు. డెత్ ఓవర్లలో అయితే రబడ ఒక ఓవర్ లో 18 పరుగులు ఇస్తే, బార్ట్ మన్ అయితే ఏకంగా 21 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు ఓవర్లే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని అంతా అనుకున్నారు.

అలా హ్యారీ బ్రూక్ 37 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. లివింగ్టన్ తో కలిసి మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు. అయితే లివింగ్టన్ 17 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేసిన అవుట్ అయ్యాడు. చివరి వరకు ఉన్న బ్రూక్ సరిగ్గా ఆఖరి ఓవర్ తొలి బంతికి అవుట్ అయిపోయాడు.

అంతే మ్యాచ్ సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోయింది. చివర్లో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆఖరి ఓవర్ లో 14 పరుగులు చేయాల్సి ఉంటే, 7 పరుగులు మాత్రమే వచ్చాయి. మొత్తానికి ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చివరికి 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

సౌతాఫ్రికా బౌలింగులో రబడ 2, కేశవ్ మహరాజ్ 2, బార్ట్ మన్ 1, అన్రిచ్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. 38 బంతుల్లో 4 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ హేండ్రిక్స్ (19) మాత్రమే చేశాడు. అయితే ఫస్ట్ డౌన్ వచ్చిన క్లాసెన్ (8), కెప్టెన్ మార్ క్రమ్ (1) వెంటనే అవుట్ అయిపోయారు.

అప్పుడు జట్టు బాధ్యతను డేవిడ్ మిల్లర్ భుజమ్మీద వేసుకున్నాడు. చకచకా 28 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి జట్టుకి పోరాడే స్కోరు అందించాడు. ఈ క్రమంలో మార్కో జాన్సన్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అయితే చివర్లో స్టబ్స్ (12 నాటౌట్), కేశవ్ మహరాజ్ (5 నాటౌట్) తమ వంతు పరుగులు అందించారు. మొత్తానికి సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బౌలింగులో మొయిన్ ఆలి 1, ఆర్చర్ 3, ఆదిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×